నటుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం తథ్యం అనిపిస్తోంది. చాలాకాలం క్రితమే ఈయన రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. ఆయన తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ కూడా విజయ్ అభిమానులతో సమావేశాలు నిర్వహించి మరింత జోష్ తెచ్చారు. అయితే కారణాలు ఏమైనా అప్పట్లో వెనుకంజ వేశారు.
ప్రస్తుతం అగ్ర నటుడిగా రాణిస్తున్న విజయ్ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే మరోపక్క అభిమానులను ప్రజల అవసరాలను గ్రహించి వాటిని పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో విజయ్ మక్కళ్ ఇయక్కమ్ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో ఇటీవల కాలంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు.
தளபதி @actorvijay அவர்களின் வாழ்த்துக்களுடன்,
— Thalapathy Vijay Makkal Iyakkham (@TVMIoffl) August 26, 2022
செங்கல்பட்டு மேற்கு மாவட்ட மாணவரணி தலைமை தளபதி மக்கள் இயக்கம் சார்பாக ஊக்குவிக்கும் விதமாக இரட்டை மாணவ சகோதரிகளுக்கு ரூபாய் ₹20,000/-த்தை கல்வி உதவித் தொகையாக வழங்கினார்கள்.!@BussyAnand @Jagadishbliss @RIAZtheboss #TVMI #Varisu pic.twitter.com/q1lnXwWBOJ
అలాగే ప్రతి ఆదివారం పుదుచ్చేరిలో తనే స్వయంగా గ్రామాల్లో తిరుగుతూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో రాజకీయ నాయకులు పదవుల కోసం పరుగులు తీస్తుంటే విజయ్ మక్కళ్ ఇయక్కం నిర్వాహకులు ప్రజల మధ్యకు వెళ్తూ వారి అవసరాలను తీర్చుతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
தளபதி @actorvijay அவர்களின் உத்தரவின்படி,
— Thalapathy Vijay Makkal Iyakkham (@TVMIoffl) August 21, 2022
இன்று அகில இந்திய தளபதி மக்கள் இயக்க தலைமை அலுவலகத்தில் தகவல் தொழில்நுட்ப அணி தொடர்பான ஆலோசனைக்கூட்டம் நடைபெற்றது.!#ThalapathyVijayMakkalIyakkham #TVMI #Beast #Varisu @BussyAnand @Jagadishbliss @RIAZtheboss pic.twitter.com/KAEcENgRJ7
Comments
Please login to add a commentAdd a comment