సాక్షి, చెన్నై: 2021 ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతుగా దళపతి విజయ్ సంకేతాల్ని ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ఆయన తన మక్కల్ ఇయక్కం వర్గాలతో మంతనాల్లో మునిగినట్టు తెలిసింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో తన మద్దతును అన్నాడీఎంకేకు విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన అభిమానులు అన్నాడీఎంకే వర్గాలతో కలిసి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు. ఆ తర్వాత పరిణామాలతో అన్నాడీఎంకే సర్కారు ఆగ్రహాన్ని విజయ్ చవి చూడాల్సి వచ్చింది. 2016లో మౌనముద్రను అనుసరించిన విజయ్ తాజాగా మళ్లీ అన్నాడీఎంకేకు మద్దతు ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. చదవండి: నో పార్టీ.. ఓన్లీ సేవ
ఇందుకు తగ్గట్టుగానే ఆదివారం సీఎం పళనిస్వామిని విజయ్ కలిసినట్టు చర్చ సాగుతోంది. 140 కోట్ల మేరకు బడ్జెట్‌తో రూపొందించిన మాస్టర్ చిత్రం నష్టాల పాలు కాకుండా , విడుదల సమయంలో ఇబ్బందులు తలెత్తని రీతిలో సీఎంతో విజయ్ భేటీ సాగినట్టు ఇప్పటికే సమాచారాలు వెలువడ్డాయి. ఇందుకు ప్రతిఫలంగా రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు ఇచ్చే రీతిలో విజయ్ ముందు అన్నాడీఎంకే వర్గాలు ప్రతిపాదన ఉంచినట్టు సమాచారం. దీంతో అన్నాడీఎంకేకు మద్దతు ఇచ్చే విషయంగా తన మక్కల్ ఇయక్కం వర్గాలతో విజయ్ మంతనాల్లో మునగడం ఆలోచించ దగ్గ విషయమే. తన చిత్ర విడుదలకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉంటే, ఆ చిత్రం కలెక్షన్లు ఆశాజనకంగా ఉన్న పక్షంలో అన్నాడీఎంకేకు విజయ్ మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువేనని ఇయక్కం వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment