సినిమాకు, రాజకీయాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. పరిస్థితులు, అవకాశాలను బట్టి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లడం సర్వ సాధారణం. ముఖ్యంగా తమిళనాడులో సినీ రాజకీయాలు ప్రత్యేకం. ఇక్కడ హీరోలు, హీరోయిన్లు, రచయితలు రాష్ట్రాన్ని పాలించిన చరిత్ర. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక నటీమణుల విషయానికి వస్తే సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న సీనియర్ హీరోయిన్లలో చాలామంది తదుపరి గురి రాజకీయాల పైనే. నటి వైజయంతి మాల నుంచి వెన్నరాడై నిర్మల, జయప్రద, నగ్మ, కుష్భు, కోవై సరళ, శ్రీప్రియ, రాధిక, నమిత ఇలా చాలా మంది సినీ రంగం నుంచి రాజకీయ రంగానికి వచ్చినవారే. ఈ జాబితాలో తాజాగా నటి త్రిష పేరు కూడా వినిపిస్తోంది.
చదవండి: అలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలంటున్న నటి సురేఖ వాణి
ఆమె త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతోందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన ఆమెకు నటిగా ఒక స్థాయి, ప్రత్యేక గౌరవం ఉంది. అయితే త్రిష తరఫున నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఈ ప్రచారంపై స్పందించ లేదు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఇళంగోవన్ దీనిపై స్పందించారు. త్రిష కాంగ్రెస్‌లో చేరడంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఈ సమాచారం, ప్రచారం నిజమో? కాదో తనకు తెలియదన్నారు. ఆమె పార్టీలో చేరడం ద్వారా పార్టీకి బలమవుతుందని తాను భావించడం లేదని, పెద్దగా స్పందన కూడా ఉండదన్నారు. త్రిషనే కాదు ఇంకెవరైనా తమ పార్టీలో చేరుతామంటే స్వాగతిస్తామని ఇళంగోవన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment