Ilamgovan
-
కాంగ్రెస్‌లోకి త్రిష! రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు ఇళంగోవన్ క్లారిటీ
సినిమాకు, రాజకీయాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. పరిస్థితులు, అవకాశాలను బట్టి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లడం సర్వ సాధారణం. ముఖ్యంగా తమిళనాడులో సినీ రాజకీయాలు ప్రత్యేకం. ఇక్కడ హీరోలు, హీరోయిన్లు, రచయితలు రాష్ట్రాన్ని పాలించిన చరిత్ర. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక నటీమణుల విషయానికి వస్తే సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న సీనియర్ హీరోయిన్లలో చాలామంది తదుపరి గురి రాజకీయాల పైనే. నటి వైజయంతి మాల నుంచి వెన్నరాడై నిర్మల, జయప్రద, నగ్మ, కుష్భు, కోవై సరళ, శ్రీప్రియ, రాధిక, నమిత ఇలా చాలా మంది సినీ రంగం నుంచి రాజకీయ రంగానికి వచ్చినవారే. ఈ జాబితాలో తాజాగా నటి త్రిష పేరు కూడా వినిపిస్తోంది. చదవండి: అలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలంటున్న నటి సురేఖ వాణి ఆమె త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతోందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన ఆమెకు నటిగా ఒక స్థాయి, ప్రత్యేక గౌరవం ఉంది. అయితే త్రిష తరఫున నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఈ ప్రచారంపై స్పందించ లేదు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఇళంగోవన్ దీనిపై స్పందించారు. త్రిష కాంగ్రెస్‌లో చేరడంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఈ సమాచారం, ప్రచారం నిజమో? కాదో తనకు తెలియదన్నారు. ఆమె పార్టీలో చేరడం ద్వారా పార్టీకి బలమవుతుందని తాను భావించడం లేదని, పెద్దగా స్పందన కూడా ఉండదన్నారు. త్రిషనే కాదు ఇంకెవరైనా తమ పార్టీలో చేరుతామంటే స్వాగతిస్తామని ఇళంగోవన్ పేర్కొన్నారు. -
ఏపీ నకిలీ నంబర్ ప్లేట్లతో 570 కోట్ల రవాణా
- తమిళనాడు ఎన్నికల సమయంలో పట్టుబడిన మూడు కంటైనర్లపై కేసు - సీబీఐ అధికారి వెల్లడి సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పట్టుబడిన రూ.570 కోట్ల నగదు రవాణా కంటైనర్ లారీలకు విశాఖపట్నానికి చెందిన మోటార్ బైక్‌ల నంబర్లు వినియోగించినట్లు సీబీఐ ప్రాథమిక విచారణలో తేలింది. అప్పట్లో తిరుపూరు జిల్లాలో పట్టుబడిన ఈ మూడు కంటైనర్లను చెన్నైలోని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు విడిపించుకెళ్లారు. కంటైనర్లలో నగదు రవాణా వెనుక ఏదో కుట్ర ఉందని డీఎంకే అనుమానించింది. డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ సీబీఐ విచారణ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కంటైనర్ల కేసును విచారించాల్సిందిగా సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో దర్యాప్తులో తేలిన కొన్ని నిజాలను ఢిల్లీలోని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు బయటపెట్టారు. ఆ మూడు కంటైనర్లు (ఏపీ13 ఎక్స్ 5204, ఏపీ 13 ఎక్స్ 8650, ఏపీ 13 ఎక్స్ 5203) విశాఖపట్నంలోని ఒక ట్రాన్స్‌పోర్టు క్యారియర్ వారి మోటార్ బైక్‌ల కోసం జారీ చేసినట్లు తెలుసుకున్నామన్నారు. ఈ కేసు వ్యవహారంలో ఇంకా ఒక నిర్ణయానికి రాకున్నా నగదు రవాణా వెనుక ఏదో అక్రమం దాగి ఉందని అనుమానిస్తున్నట్లు తెలిపారు. రూ.570 కోట్లను విడిపించుకునేందుకు ఎస్బీఐ అధికారులు 24 గంటల సమయం తీసుకోవడంలోనూ ఏదో మతలబు ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. కంటైనర్లకు కాపలాగా అనుసరించిన వ్యక్తుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, అందులోని సంభాషణలను విశ్లేషించనున్నట్లు తెలిపారు.