సాక్షి బెంగళూరు: వివాహం అనంతరం శారీరక సంబంధాన్ని నిరాకరించడం నేరం కాదని కర్ణాటక రాష్ట్ర హైకోర్టు అభిప్రాయపడింది. ఇదే సమయంలో హిందూ వివాహ చట్టం–1955 ప్రకారం లైంగిక చర్యకు నిరాకరించడం క్రూరత్వంతో సమానమని తెలిపింది. శారీరక సంబంధం నిరాకరించిన ఘటనలో ఒక భర్తపై భార్య, ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన క్రిమినల్ కేసుపై విచారించిన హైకోర్టు ఈమేరకు వ్యాఖ్యానించింది.
శారీరక సంబంధాన్ని నిరాకరించడం ఐపీసీ సెక్షన్ 489ఏ కిందికి రాదని, అది నేరం కాదని స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 498ఏ, వరకట్న నిరోధక చట్టం–1961 సెక్షన్ 4 కింద దాఖలైన కేసులు, పోలీసు చార్జిషీట్‌ను వ్యతిరేకిస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న విచారించారు.
‘పిటిషనర్ ధార్మికుడు. అతని దృష్టిలో ప్రేమ అంటే శారీరక సంబంధం కాదు. అది ఆత్మల కలయిక. అందుకే భార్యతో శారీరక సంబంధాన్ని నిరాకరించాడు’అని జడ్జి తెలిపారు. ఇలా శారీరక సంబంధం కలిగి ఉండకపోవడం హిందూ వివాహ చట్టం సెక్షన్ 12 (1) (ఏ) కింద క్రూరమైన చర్య, అయితే ఐపీసీ 498 (ఏ) కింద నేరం కాదంటూ భర్త, అతని తల్లిదండ్రులపై పెట్టిన కేసులను కొట్టివేశారు.
Comments
Please login to add a commentAdd a comment