
ఢిల్లీ: దేశంలో ఇప్పటికే రెండు దశల్లో ఓటింగ్ ప్రక్తియ పూర్తయింది. మే 7న మూడోదశ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చేనెలలో జరగనున్న ఈ ఎన్నికల్లో 1352 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఇందులో 9 శాతం మహిళా అభ్యర్థులు, మిగిలినవారు పురుష అభ్యర్థులు ఉన్నట్లు తెలిసింది.
మే 7న మొత్తం 12 రాష్ట్రాల్లో 94 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఇందులో పోటీ చేస్తున్న మొత్తం 1352 మంది అభ్యర్థులలో 244 లేదా 18 శాతం మందిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయని 'అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్' (ADR) ఇటీవల వెల్లడించిన డేటాలో పేర్కొంది.

ఏడీఆర్ నివేదికలో వెల్లడైన 172 మంది అభ్యర్థులలో కూడా సుమారు 13 శాతం మందిపైన తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఏడుమంది దోషులుగా తేలారని, ఐదుగురు హత్యానేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 38 మంది అభ్యర్థులు మహిళలపై హింసకు సంబంధించిన కేసులు ఉన్నాయి. 17 మంది అభ్యర్థులపై ద్వేషపూరిత ప్రసంగ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment