
సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది. గుంటూరులో పవన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో, కోర్టు ఎదుట హాజరు కావాలని జిల్లా జడ్జి శరత్‌బాబు నోటీసుల్లో పేర్కొన్నారు.
వివరాల ప్రకారం.. జనసేన అధినేత పవన్‌పై గుంటూరులో క్రిమినల్ కేసు నమోదైంది. ఏపీలో వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ వాలంటీర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు డైరెక్షన్‌తో ఐపీసీ సెక్షన్ 499, 500 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో మార్చి 25వ తేదీన గుంటూరు కోర్టులో పవన్ హాజరు కావాలని నాలుగో అదనపు జడ్జి శరత్‌బాబు తాజాగా ఇచ్చిన నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా, జూలై మూడో తేదీన ఏలూరులో జరిగిన వారాహియాత్రలో వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment