
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్లో నిందితులను జైలు నుంచి విడుదల చేసే విషయంలో క్రమబద్ధత సాధించేందుకు బెయిల్ చట్టం తీసుకువచ్చే విషయం పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. చట్టంలో పొందుపరిచిన స్వేచ్ఛ హక్కును పరిరక్షించాలి, రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం ఉన్న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్వాతంత్య్రానికి పూర్వమున్న విధానానికి కొనసాగింపు మాత్రమేనని పేర్కొంది. దేశంలోని జైళ్లు విచారణ ఖైదీలతో కిక్కిరిసిపోయాయని తెలిపింది. గుర్తించదగిన నేరాన్ని నమోదు చేసినప్పటికీ వీరిలో ఎక్కువ మందిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై పోలీసు రాజ్యమనే ముద్ర పడరాదని జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment