
న్యూయార్క్: శృంగార తార(మాజీ)తో సంబంధం బయటపడకుండా ఉండేందుకు ఆమెకు డబ్బు చెల్లించి అనైతిక ఒప్పదం చేసుకున్న కేసులో.. డొనాల్డ్ ట్రంప్‌పై దాదాపు నేరారోపణలు రుజువయ్యాయి. అయితే ఆయన అరెస్ట్‌కు కోర్టు ఆదేశాలు ఇచ్చేకంటే ముందే.. ఆయన స్వచ్ఛందంగా కోర్టులో లొంగిపోవాలని, ఆరోపణలపై విచారణకూ హాజరు కావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ట్రంప్ తరపున లాయర్(అటార్నీ) జోయ్ టాకోపినా ఒక ప్రకటన చేశారు.
ట్రంప్ వచ్చేవారం మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో లొంగిపోయే అవకాశం ఉందని జోయ్ ప్రకటించారు. మరోవైపు ట్రంప్ లీగల్ టీం కూడా ప్రాసిక్యూటర్‌లతో టచ్‌లో ఉందని, వచ్చేవారం విచారణకు ఆయన వాళ్ల ఎదుట హాజరు కావొచ్చని పేర్కొంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి.
సె* స్కాండల్ కేసులో దోషిగా తేలినప్పటికీ.. 2024 అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్ వేసిన బిడ్‌పై అనర్హత వేటు పడదు. ఎందుకంటే గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికలకు ట్రంప్ తన అభ్యర్థిత్వ పత్రాలను దాఖలు చేశారు కాబట్టి. కాకపోతే నైతిక విజయంపై ఇది ప్రభావం చూపెట్టవచ్చని, ఆయన కెరీర్‌లో ఓ మచ్చగా మిగిలిపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
hush money case ప్రకారం.. ట్రంప్ తనతో ఉన్న లైంగిక సంబంధాన్ని బహిరంగపర్చకుండా ఉండేందుకు.. స్టార్మీ డేనియల్స్ అలియాస్ స్టెఫానీ క్లిఫార్డ్ అనే పో* స్టార్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అందుకుగానూ తన వ్యక్తగత లాయర్ ద్వారా ఆమెకు లక్షా 30 వేల డాలర్లు ముట్టజెప్పాడు ట్రంప్. ఇది 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు జరిగింది.
అయితే.. రెండేళ్ల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చింది. ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని, తమ మధ్య జరిగిన నాన్‌డిస్‌క్లోజర్ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్‌ఏంజెల్స్ కోర్టులో దావా వేసిందామె. ఆ సమయంలో ట్రంప్ అధ్యక్ష స్థానంలో ఉండడంతో దీన్నొక హైప్రొఫైల్ కేసుగా భావించి.. అత్యున్నత దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఈ కేసులోనే ఆరోపణలు రుజువు కావడంతో.. ఆయనపై ఇప్పుడు నేరారోపణలు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. 2006లో రియల్ ఎస్టేట్ టైకూన్‌గా పేరొందిన డొనాల్డ్ ట్రంప్.. స్టార్మీ డేనియల్స్‌ను తొలిసారిగా ఓ గోల్ఫ్ టోర్నమెంట్ సందర్భలో కలుసుకున్నారు. ఆ సమయానికి ఆమె వయసు 27. ట్రంప్ వయసు 60. 2018లో ఫుల్ డిస్‌క్లోజర్ అనే పుస్తకం ద్వారా ట్రంప్‌తో తనకు జరిగిన పరిచయం, ఆపై విషయాలను ప్రచురించింది స్టార్మీ డేనియల్స్.
ఆ ఈవెంట్‌లో ట్రంప్ బాడీగార్డుల్లో ఒకతని ద్వారా నాకు ఆహ్వానం అందింది. ఆయన(ట్రంప్), నేను రాత్రి భోజనం తర్వాత ఆయనకు సంబధించిన ఓ పెంట్‌హౌజ్‌కు చేరుకున్నాం. అక్కడే తామిద్దరం శారీరకంగా కలుసుకున్నాం. అప్పటికీ ఆయన మూడో భార్య.. పిల్లలను కని నెలలు అవుతుందేమో. నాతో కలయికను ట్రంప్ ఎంతగానో పొగిడారని ఆ బుక్‌లో ఆమె పేర్కొంది.
2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో.. తనకు ఇచ్చిన మాట తప్పడంతో ఈ శృంగార తార సంబంధం బయటపెట్టేందుకు సిద్ధమైంది. అయితే తన లాయర్ ద్వారా ఆమెతో ఒప్పంద చేసుకుని.. డబ్బు ద్వారా ఆమె నోరు మూయించే యత్నం చేశాడు ట్రంప్. 2018 ఓ అంతర్జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారామె.
మరోవైపు ట్రంప్ ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. దీనిని ఎలా ఎదుర్కొన్నాలో తనకు తెలుసని సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment