వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ అనుసరించిన ఆర్థిక విధానాలు అత్యంత అసమర్థమైనవంటూ రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దుయ్యబట్టారు. ‘‘నేను గెలిస్తే వాటికి ముగింపు పలుకుతా. ‘బిల్డ్ అమెరికన్, బై అమెరికన్, హైర్ అమెరికన్’వంటి సరికొత్త విధానాలతో ఆర్థిక రంగంలో అద్భుతాలు చేసి చూపిస్తా’’అన్నారు. స్వింగ్ రాష్ట్రమైన మిషిగన్‌లోని డెట్రాయిట్‌లో శుక్రవారం ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ‘
‘అమెరికాను హారిస్ సర్వనాశనం చేశారు. ఆమె ఆర్థిక విధానాల వల్ల గత కొద్ది రోజుల్లోనే ప్రైవేట్ రంగంలో ఏకంగా 30 వేలు, నిర్మాణ రంగంలో ఏకంగా 50 వేల ఉద్యోగాలకు కోత పడింది. కార్మిక లోకాన్ని ఆమె నిండా ముంచుతున్నారు’’అని ఆరోపించారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధానికి, పశి్చమాసియాలో అనిశి్చతికి నేను ముగింపు పలుకుతా. మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తా. సైన్యాన్ని ఆధునీకరిస్తా. మత స్వేచ్ఛను, ఆయుధాలు కలిగి ఉండే హక్కును పరిరక్షిస్తా. అక్రమ వలసలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తా’’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment