వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు ఒకే రోజు సమయముందనగా తనకు వ్యతిరేకంగా వెల్లడైన ఒక పోల్ సర్వేను రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. అయోవా డెమోక్రాట్ అభ్యర్థి కమలాహారిస్ తనకంటే లీడింగ్‌లో ఉందని తెలిపిన సర్వేను ట్రంప్ మండిపడ్డారు. ఆ సర్వే ఫేక్ అని కొట్టిపారేశారు.
అయోవా రాష్ట్రంలో కమలాహారిస్‌కు 47 శాతం, ట్రంప్‌నకు 44 శాతం మంది మద్దతిస్తున్నారంటూ తాజా పోల్ ఒకటి వెల్లడైంది. దీనిపై ట్రంప్ స్పందించారు. ప్రత్యర్థులు కావాలనే ఇలాంటి ఫేక్ సర్వేను సృష్టించారని మండిపడ్డారు.‘ఐయామ్ నాట్ డౌన్’ అని ధీమా వ్యక్తం చేశారు. అయితే సెప్టెంబర్‌లో అయోవాలో ట్రంప్ లీడింగ్‌లో ఉన్నట్లు అదే సర్వే సంస్థ అంచనాలు వెల్లడించింది.
ఇప్పుడు పరిస్థితి మారిపోయి కమల లీడ్‌లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు అయోవాలో 9 పాయింట్ల ఆధిక్యం లభించడం గమనార్హం.మంగళవారం(నవంబర్ 5) అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఇదీ చదవండి: అబార్షన్ మా హక్కు
Comments
Please login to add a commentAdd a comment