వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవిని దాదాపు ఖరారు చేసుకున్న రిపబ్లికన్ పార్టీ అభ్ఘర్థి డొనాల్డ్ ట్రంప్ తమ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సేన్ జేడీ వాన్స్‌పై ప్రసంశలు కురిపించారు. ఈయన భార్య ఉషా చిలుకూరి తెలుగు సంతతికి చెందినవారు.
ఇప్పటివరకూ వచ్చిన ఫలితాల ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయ పథాన దూసుకుపోతున్నారు. ఫలితాలు వెలువడుతున్న సమయంలో ట్రంప్ ఫ్లోరిడాలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి సేన్ జేడీ వాన్స్ తనకు అనుక్షణం అండగా నిలిచారంటూ ప్రసంశలు కురిపించారు. అలాగే అతని భార్య, తెలుగింటి ఆడపడుచు ఉషా చిలుకురి వాన్స్‌ను కూడా ట్రంప్ అభినందించారు.
జేడీ వాన్స్ భార్య ఉష చిలుకూరి తెలుగు సంతతికి చెందినవారు. గత ఏడాది వరకూ విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేసిన శాంతమ్మ మనుమరాలు ఉషా చిలుకూరి. అమెరికా ఉపాధ్యక్షునిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జేడీ వాన్స్ పేరు ఖరారైన దరిమిలా ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది.
ఉషకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో బంధువులు ఉన్నారు. 90 ఏళ్ల వయస్సులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు పలు పరిశోధనలు సాగిస్తున్న ప్రొఫెసర్ శాంతమ్మకు ఉష మనవరాలు అవుతారు. తెలుగు ప్రొఫెసర్‌గా సేవలు అందించిన శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి కొన్నేళ్ల క్రతమే మృతి చెందారు. సుబ్రహ్మణ్యశాస్త్రి తమ్ముడు రామశాస్త్రి కుమారుడైన రాధాకృష్ణ కుమార్తెనే ఉషా చిలుకూరి.
Comments
Please login to add a commentAdd a comment