యూఎస్ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ వీడింది. రిపబ్లికన్ పార్టీ భారీ మెజారిటీతో దూసుకుపోతోంది. దీంతో అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఫ్లోరిడాలో ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ.. అధ్యక్ష ఎన్నికలలో టెస్లా అధినేత 'ఎలాన్ మస్క్' ముఖ్యమైన వ్యక్తి అని కొనియాడారు.
ఒక స్టార్ ఉంది.. అని మస్క్ గురించి మాట్లాడుతూ.. అతను ఒక మేధావి. మన మేధావులను మనం రక్షించుకోవాలి. అంతే కాకుండా తన సంస్థ స్పేస్ ఎక్స్ ప్రయత్నాలతో అమెరికా అంతరిక్ష రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మస్క్ చేసిన కృషిని కూడా ఈ సందర్భంగా కొనియాడారు.
ట్రంప్ ప్రసంగం సమయంలో మస్క్ స్వయంగా ఈవెంట్‌కు హాజరు కానప్పటికీ.. ఓటింగ్ రోజు వరకు రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. మొత్తానికి ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ ఆశించిన విధంగానే.. ట్రంప్ మరో మారు అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించబోతున్నారు.
'ట్రంప్'కు మద్దతుగా మస్క్ ఫిలడెల్ఫియా ప్రాంతంలో అక్టోబర్ 17న తొలి వ్యక్తిగత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంతకు ముందు ట్రంప్ పాలనలో చోటు చేసుకున్న ముఖ్యమైన అంశాలను గురించి వెల్లడించారు. అప్పటి నుంచి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం.. మస్క్ గట్టిగా కృషి చేస్తూనే ఉన్నారు.
చదవండి: తెలుగింటి అల్లుడిపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు
ట్రంక్ విజయం కోసం మస్క్ ప్రచారం చేయడం మాత్రమే కాకుండా.. భారీ మొత్తంలో ఎలక్షన్ ఫండ్స్ కూడా సమకూర్చారు. స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రైజ్ మనీరూపంలో 100 డాలర్లు ఇస్తామని కూడా ప్రకటించారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికే ఈ ప్రైజ్ మనీ అని డెమోక్రట్లు ఆరోపించారు.
జోష్‌లో ఎలాన్ మస్క్
డొనాల్డ్ ట్రంప్ ఘన విజయంతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అమెరికా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని పేర్కొంటూ.. అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న రాకెట్ ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు. అమెరికా ప్రజలు మార్పు కోసం ఓటు వేశారని, డొనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ స్పష్టమైన తీర్పు ఇచ్చారని మస్క్ వ్యాఖ్యానించారు.
The future is gonna be fantastic pic.twitter.com/I46tFsHxs3
— Elon Musk (@elonmusk) November 6, 2024
Comments
Please login to add a commentAdd a comment