వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తప్పుడు సమాచారాన్ని, తప్పుదోవ పట్టించే కథనాలను ఎక్స్, సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ వ్యాప్తి చేసినట్టు ఓ అధ్యయనం తెలిపింది. కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో అవి బాగా ప్రభావం చూపినట్టు వెల్లడించింది. అమెరికా ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారంపై అధ్యయన ఫలితాలను సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హేట్ వెల్లడించింది. ‘‘తప్పుడు సమాచార వ్యాప్తికి మస్క్, ఎక్స్ ముఖ్య కేంద్రాలుగా మారినట్టు గుర్తించాం. ఎన్నికలపై మస్క్ తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఏడాది పొడవునా ఎక్స్‌లో ఏకంగా 200 కోట్ల వ్యూస్ సాధించడం ఆశ్చర్యకరం. స్వింగ్ రాష్ట్రాల్లో వీటి వ్యాప్తిలో ఎక్స్ పాత్ర ఎక్కువగా ఉంది’’అని పేర్కొంది.
ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మస్క్ బాహాటంగా మద్దతు ప్రకటించడం తెలిసిందే. మస్‌్కకు ఎక్స్‌లో ఏకంగా 20.3 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. తాజా అధ్యయనం ప్రకారం ఈ ఏడాది మస్క్ పెట్టిన 87 పోస్టులు అమెరికా ఎన్నికల కంటెంట్‌ను ప్రచారం చేశాయి. ఇవి 200 కోట్ల వ్యూస్ సాధించాయి. వీటిని తప్పుదోవ పట్టించేవిగా ఫ్యాక్ట్ చెకర్స్ గుర్తించారు. స్వింగ్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాలో ఈ కథనాలు బాగా ప్రభావం చూపాయి.
Comments
Please login to add a commentAdd a comment