కమలా హారిస్‌ స్వగ్రామంలో ఉత్సవ వాతావరణం | Festive atmosphere in Kamala Harris hometown | Sakshi
Sakshi News home page

కమలా హారిస్‌ స్వగ్రామంలో ఉత్సవ వాతావరణం

Published Wed, Nov 6 2024 8:18 AM | Last Updated on Wed, Nov 6 2024 8:53 AM

Festive atmosphere in Kamala Harris hometown

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. హారిస్ స్వగ్రామమైన తమిళనాడులోని తులసేంద్రపురంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి కమలా హారిస్‌ విజయం సాధించాలని గ్రామస్తులు శ్రీ ధర్మ సంస్థ ఆలయంలో ప్రార్థనలు చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధించాలని కమలా హారిస్ స్వగ్రామ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

తిరువారూరు జిల్లా తులసేంద్రపురం గ్రామంలో  ఎక్కడ చూసినా జనంలో ఉత్సాహం కనిపిస్తోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజయం సాధించాలని గ్రామ ప్రజలు  కోరుకుంటున్నారు.

గ్రామస్తులు కమలా మారిస్‌ చిత్రంతో కూడిన భారీ బ్యానర్‌ను  ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్‌పై కమలకు అభినందనలు తెలియజేశారు.

తులసేంద్రపురం కమల తాత, భారత మాజీ దౌత్యవేత్త పివి గోపాలన్ పూర్వీకుల గ్రామం

కమల తల్లి శ్యామల మాజీ భారత దౌత్యవేత్త గోపాలన్ కుమార్తె.

ఆగస్టు 2020లో కమల డెమోక్రటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నామినేట్ అయినప్పుడు ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది.

ఆ ఏడాది ఆమె సాధించిన విజయానికి గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు

శ్రీ ధర్మ సంస్థ ఆలయంలోని మూలదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ ఆలయంలోని మూల దేవతలు కమల పూర్వీకుల కుల దేవతలు.

మదురైలోనూ కమల విజయం కోరుతూ ప్రార్థనలు జరిగాయి. ఆధ్యాత్మిక సంస్థ అనుషానతిన్ నవంబర్ 4న ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది.

కమల ఎన్నికల్లో గెలిస్తే జిల్లాలోని పంగనాడు గ్రామ నేతు పేదలకు ‘అన్నదానం’ ఏర్పాటు చేయనున్నారు.

కమల తాత గోపాలన్ ఈ గ్రామంలోనే జన్మించారు. ఆయన శ్రీ ధర్మ సంస్థ మందిరానికి సుమారు లక్ష రూపాయల విరాళం ఇచ్చారు.

అమెరికా వ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు ప్రీ-పోల్ ఓటింగ్ కింద ఇప్పటికే ఓటు వేశారు.

యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా ఎలక్షన్స్ ల్యాబ్ డేటా ప్రకారం, సోమవారం రాత్రి నాటికి 82 మిలియన్లకు పైగా ఓటర్లు ఓట్లు వేశారు.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు బుధవారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం ప్రకారం), మంగళవారం పోలింగ్ ముగిసిన కొద్ది గంటలకే రావచ్చు లేదా దీనికి రోజులు, వారాలు  లేదా నెల రోజులు పట్టే అవకాశాలున్నాయి.

2000లో జరిగిన అమెరికా ఎన్నికల్లో ఫలితాలు చాలా ఆలస్యంగా వచ్చాయి. తదుపరి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు బుష్ ఎన్నిక కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. నవంబర్ 7న ఓటింగ్ ముగిసి, డిసెంబర్ 12న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.

2020లో ఫలితాలు రావడానికి చాలా సమయం పట్టింది. ఓటింగ్ నవంబర్ 3 సాయంత్రం ముగిసింది, అయితే పెన్సిల్వేనియాలోని 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను  లెక్కించేందుకు నవంబర్ 7 వరకు వేచి ఉండాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాలు విడుదల : ఆధిక్యంలో ట్రంప్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement