వాషింగ్టన్:అమెరికా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ లీడ్‌లో ఉన్నారు. అయితే తుది ఫలితాన్ని డిసైడ్ చేసే స్వింగ్ స్టేట్‌లలో మాత్రం ట్రంప్,కమల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇప్పటివరకు ఈ స్టేట్‌లలో కీలకమైన నార్త్ కరోలినాతో పాటు జార్జియాలను ట్రంప్ కైవసం చేసుకున్నారు.
ఇది కాకుండా విస్కాన్సిన్, అరిజోనా, పెన్సిల్వేనియా, మిచిగాన్‌లలో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. కీలక పెన్సిల్వేనియాలో మాత్రం కమల లీడ్‌లో ఉన్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. స్వింగ్ స్టేట్స్ కాకుండా ఎలక్టోరల్ ఓట్లు అధికంగా ఉన్న కాలిఫోర్నియా(54)ను కమల తన ఖాతాలో వేసుకోగా టెక్సాస్(40) ఓట్లను ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు.
ఇదీ చదవండి: హారిస్, ట్రంప్ హోరాహోరీ
Comments
Please login to add a commentAdd a comment