వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఉద్దేశించి దేశ అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సోషల్‌మీడియాలో ప్రజలకు చివరిసారిగా విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.
ముస్లిం ఓటర్లకు ట్రంప్ గాలం
అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చుదిద్దుకుందామని,దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద, విస్తృతమైన సంకీర్ణాన్ని నిర్మిద్దామని ట్రంప్ ఓటర్లకు పిలుపునిచ్చారు. కమలా హారిస్ అధికారంలోకి వస్తే పశ్చిమాసియా ఆక్రమణకు గురవుతుందని శాంతిని కోరుకునే మిచిగాన్‌లోని అనేక మంది అరబ్,ముస్లిం ఓటర్లుఓటర్లకు తెలుసన్నారు. అందుకే తనకు ఓటేసి శాంతిని పునరుద్ధరించాలని ట్రంప్ కోరారు.
కమల చేతిలో ట్రంప్ ఓటమి ఖాయం:బైడెన్
మరి కొన్ని గంటల్లో ఎన్నికలు జరగనున్నాయని, కమలా హారిస్ ట్రంప్‌ను ఓడిస్తుందని తనకు తెలుసని అధ్యకక్షుడు జో బైడెన్ పోస్టు చేశారు. ఇందుకు మీరంతా ఓటింగ్‌లో పాల్గొనాలని బైడెన్ కోరారు.ముందస్తు ఓటింగ్‌ను వినియోగించుకోని వారంతా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
Tomorrow is our last chance to defeat the corrupt establishment. GET OUT AND VOTE! #FightForAmerica https://t.co/czQRkZmr59 pic.twitter.com/vKF0bXhBnb
— Donald J. Trump (@realDonaldTrump) November 5, 2024
ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలపై హిప్పో జోస్యం.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment