దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 గంటలకు సెన్సెక్స్ 97.18 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 79,573.81 వద్ద, నిఫ్టీ 34.85 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 24,279.70 వద్ద ముందుకు సాగుతున్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో అపోలో హాస్పిటల్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఆటో, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్, డీఎల్ఎఫ్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాయి. టైటాన్ కంపెనీ, హిందాల్కో, టాటా స్టీల్, టాటా మోటార్స్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ, మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాల బాట పట్టాయి.
యూఎస్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో డోజోన్స్, నాస్‌డాక్ సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ట్రంప్' షేర్స్ ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. జపాన్, సౌత్ కొరియా మార్కెట్లు సైతం లాభాల్లోనే సాగుతున్నాయి. అమెరికా ఎన్నికల ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్న సమయంలో స్టాక్ మార్కెట్ జోరందుకుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment