
న్యూయార్క్: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భర్త డగ్లస్ ఎంహోఫ్ తన మొదటి భార్యను మోసం చేశానని అన్నారు. అయితే డగ్లస్ ఎంహోఫ్ గతంలో తన ఇద్దరు పిల్లలు చదివే ప్రైవేట్ స్కూల్ టీచర్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని బ్రిటిష్ మీడియా ఓ నివేదిక వెల్లడించింది. ఆ మహిళ ప్రెగ్నెంట్ అయ్యిందని.. అయితే గర్భాన్ని ఉంచుకోలేదని పేర్కొంది.
దీనిపై తాజాగా డగ్లస్ ఎంహోఫ్ స్పందించారు. ‘నా మొదటి వివాహం తర్వాత నా చర్యలతో నేను, కెరిస్టిన్ చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాం. దీనికి నేను పూర్తి బాధ్యత వహించాను. తర్వాత మేము ఇద్దరం కుటుంబం కోసం మా బంధాన్ని బలంగా నిలుపుకున్నాం. నేను నా మొదటి భార్యతో ఉన్న సమయంలో మరో మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నాను. ఈ విషయంలో నేను నా మొదటి భార్యను మోసం చేశాను’’ అని ఆయన సీఎన్‌ఎన్‌తో తెలిపారు. మొదటి భార్య కెరిస్టిన్‌తో ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇంతకంటే ముందు ఎమ్‌హోఫ్ మొదటి భార్య కెరిస్టిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను ఎంహోఫ్ వ్యక్తిగతమైన కారణాలతో కొన్నేళ్ల క్రితం ఇద్దరి అంగీకారంతో వీడిపోయాం. ఆయన మా పిల్లలకు గొప్ప తండ్రి. అదేవిధంగా నాకు మంచిస్నేహితుడు. కమలా, నేను, పిల్లలు, ఎమ్‌హోఫ్‌తో కుటుంబం పట్ల చాలా గర్వపడుతున్నా’’ అని అన్నారు.
ఇక కమలా హారిస్, హెమ్‌హోఫ్ 2014లో పెళ్లి చేసుకున్నారు. కమలా హారిస్‌కు ఇది మొదటి వివాహం కాగా.. హెమ్‌హోఫ్‌కు మాత్రం రెండోది. ఆయన వివాహేతర సంబంధం గురించి హారిస్‌కు ముందే తెలుసని సీఎన్‌ఎన్ పేర్కొంది. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన కమల.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య సెప్టెంబరు 4వ తేదీన డిబేట్ జరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment