రిపబ్లికన్‌కు ప్రభుత్వంలో చోటిస్తా
సీఎన్‌ఎన్ ఇంటర్వ్యూలో హారిస్
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ట్రంప్ శకం ముగిసిందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభిప్రాయపడ్డారు. ఆయన్ను దాటి ప్రగతిబాటన ముందుకు సాగేందుకు అమెరికా ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థ్ధి అయిన ట్రంప్‌ది దేశాన్ని విభజించే ఎజెండా అని ఆరోపించారు. తన రన్నింగ్‌మేట్ టిమ్ వాల్జ్‌తో కలిసి గురువారం సీఎన్‌ఎన్ చానల్‌కు హారిస్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థగా ఖరారయ్యాక ఆమె ఇచి్చన తొలి ఇంటర్వ్యూ ఇదే. వలసలు, వాతావరణ మార్పులతో పాటు చమురు వెలికితీత వంటి పలు అంశాలపై తన వైఖరిలో వచి్చన మార్పులను హారిస్ పూర్తిగా సమరి్థంచుకున్నారు. తాను మొదటినుంచీ పాటిస్తూ వచి్చన విలువల్లో మాత్రం ఇప్పటికీ, ఎప్పటికీ ఏ మార్పూ లేదని స్పష్టం చేశారు. తాను ప్రెసిడెంట్ అయితే రిపబ్లికన్ నేతకు ప్రభుత్వంలో స్థానం కల్పిస్తానని హారిస్ ప్రకటించారు.
తద్వారా తాను అమెరికన్లందరికీ ప్రెసిడెంట్‌నని నిరూపిస్తానన్నారు. తన భారత, జమైకా మూలాలపై ట్రంప్ చేస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు ఇష్టపడలేదు. దక్షిణాసియా వ్యక్తిగా చెప్పుకునేందుకు ఇష్టపడే హారిస్ అధ్యక్ష ఎన్నికల్లో లబ్ధి కోసం హఠాత్తుగా తన నల్లజాతి మూలాలను గురించి మాట్లాడుతున్నారని ట్రంప్ ఇటీవల పదేపదే ఆరోపిస్తుండటం తెలిసిందే. మెక్సికో నుంచి అక్రమ వలసలు అమెరికన్ల భద్రతకు ప్రధాన సమస్యేనని హారిస్ అన్నారు. వాటిపై కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. గాజా తదితరాలపై బైడెన్ విధానాలను కొనసాగిస్తానని ఆమె వెల్లడించారు.
బైడెన్ ఫోన్ చేసిన వేళ...
పోటీ నుంచి తప్పుకోవాలని అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించుకున్నాక ఆ విషయం తనకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి తెలిపారని హారిస్ వెల్లడించారు. ‘‘నేనప్పుడు నా కుటుంబీకులతో సరదాగా గడుపుతున్నా. పాన్‌కేకులు తినడం ముగించి పజిల్ సాల్వ్ చేస్తుండగా బైడెన్ ఫోన్ చేసి ఈ మాట చెప్పారు. నిజమేనా అని ఒకటికి రెండుసార్లు అడిగా. ఆయన అవునన్నారు. తన స్థానంలో నేనే అభ్యర్థి కావాలని స్పష్టంగా చెప్పారు’’ అని గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment