CNN Interview
-
Kamala Harris: ట్రంప్ శకం ముగిసింది!
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ట్రంప్ శకం ముగిసిందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభిప్రాయపడ్డారు. ఆయన్ను దాటి ప్రగతిబాటన ముందుకు సాగేందుకు అమెరికా ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థ్ధి అయిన ట్రంప్‌ది దేశాన్ని విభజించే ఎజెండా అని ఆరోపించారు. తన రన్నింగ్‌మేట్ టిమ్ వాల్జ్‌తో కలిసి గురువారం సీఎన్ఎన్ చానల్‌కు హారిస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థగా ఖరారయ్యాక ఆమె ఇచి్చన తొలి ఇంటర్వ్యూ ఇదే. వలసలు, వాతావరణ మార్పులతో పాటు చమురు వెలికితీత వంటి పలు అంశాలపై తన వైఖరిలో వచి్చన మార్పులను హారిస్ పూర్తిగా సమరి్థంచుకున్నారు. తాను మొదటినుంచీ పాటిస్తూ వచి్చన విలువల్లో మాత్రం ఇప్పటికీ, ఎప్పటికీ ఏ మార్పూ లేదని స్పష్టం చేశారు. తాను ప్రెసిడెంట్ అయితే రిపబ్లికన్ నేతకు ప్రభుత్వంలో స్థానం కల్పిస్తానని హారిస్ ప్రకటించారు. తద్వారా తాను అమెరికన్లందరికీ ప్రెసిడెంట్‌నని నిరూపిస్తానన్నారు. తన భారత, జమైకా మూలాలపై ట్రంప్ చేస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు ఇష్టపడలేదు. దక్షిణాసియా వ్యక్తిగా చెప్పుకునేందుకు ఇష్టపడే హారిస్ అధ్యక్ష ఎన్నికల్లో లబ్ధి కోసం హఠాత్తుగా తన నల్లజాతి మూలాలను గురించి మాట్లాడుతున్నారని ట్రంప్ ఇటీవల పదేపదే ఆరోపిస్తుండటం తెలిసిందే. మెక్సికో నుంచి అక్రమ వలసలు అమెరికన్ల భద్రతకు ప్రధాన సమస్యేనని హారిస్ అన్నారు. వాటిపై కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. గాజా తదితరాలపై బైడెన్ విధానాలను కొనసాగిస్తానని ఆమె వెల్లడించారు. బైడెన్ ఫోన్ చేసిన వేళ... పోటీ నుంచి తప్పుకోవాలని అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించుకున్నాక ఆ విషయం తనకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి తెలిపారని హారిస్ వెల్లడించారు. ‘‘నేనప్పుడు నా కుటుంబీకులతో సరదాగా గడుపుతున్నా. పాన్‌కేకులు తినడం ముగించి పజిల్ సాల్వ్ చేస్తుండగా బైడెన్ ఫోన్ చేసి ఈ మాట చెప్పారు. నిజమేనా అని ఒకటికి రెండుసార్లు అడిగా. ఆయన అవునన్నారు. తన స్థానంలో నేనే అభ్యర్థి కావాలని స్పష్టంగా చెప్పారు’’ అని గుర్తు చేసుకున్నారు. -
హిజాబ్ వేస్కోను.. ఇరాన్ అధ్యక్షుడికి జర్నలిస్ట్ ఝలక్
న్యూయార్క్: ఇరాన్లో హిజాబ్ హీట్ కొనసాగుతున్నవేళ.. మరో ‘అంతర్జాతీయ’ పరిణామం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాత్రికేయ దిగ్గజం క్రిస్టియానే అమన్‌పౌర్(64).. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసికి ఝలక్ ఇచ్చారు. సీఎన్ఎన్ ఛానెల్ తరపున ఆమె, ఆయన్ని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. అయితే.. హిజాబ్ ధరించాలన్న షరతుకు ఆమె అంగీకరించకపోవడంతో.. ఇంటర్వ్యూ ఇవ్వకుండానే వెనుదిరిగారు అధ్యక్షుడు రైసి. అమన్‌పౌర్ పుట్టింది లండన్‌లోనే అయినా ఆమె తండ్రి మొహమ్మద్ తఘీ ఇరాన్వాసి. పైగా పదకొండేళ్లవరకు అమన్, టెహ్రాన్‌లోనే పెరిగారు. ప్రస్తుతం CNNకు చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్‌గా పని చేస్తున్నారామె. ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ప్రసంగించేందుకు ఇరాన్ అధ్యక్షుడు రైసి న్యూయార్క్‌కు వెళ్లారు. ఈ క్రమంలో.. అమన్‌పౌర్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన అంగీకరించారు. అయితే.. ఇంటర్వ్యూకు ఏర్పాట్లు జరుగుతున్న టైంలో అధ్యక్షుడు రైసి సిబ్బంది వచ్చి.. హిజాబ్ ధరించాలంటూ అమన్‌పౌర్‌కు సూచించారు. ‘‘గతంలో ఏ ఇరాన్ అధ్యక్షుడు.. విదేశాల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇలాంటి షరతు విధించడం చూడలేదు. కాబట్టి, నేను అంగీకరించను’’ అని ఆమె తేల్చి చెప్పింది. అయితే ఇరాన్లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా(హిజాబ్ వ్యతిరేక నిరసనలు)ధరించాలని, కనీసం తలను కప్పేస్తూ ఏదైనా గుడ్డ చుట్టుకోవాలని రైసీ అనుచరుడొకరు ఆమెకు సూచించాడు. అయినప్పటికీ ఆమె ససేమీరా అనడంతో సిబ్బంది వెనుదిరిగారు. కాసేపటికే.. ఇంటర్వ్యూ ఇవ్వకుండానే అధ్యక్షుడు రైసి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో ఆమె ట్విటర్లో తన నిరసన వ్యక్తం చేశారు. తన ఎదురుగా ఖాళీ చెయిర్‌ను చూపిస్తూ.. ఇంటర్వ్యూ తాలుకా సెట్‌ను ట్విటర్లో పోస్ట్ చేశారు. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె అందులో వివరిస్తూ.. అధ్యక్షుడు రైసి తీరును తప్పుబట్టారు. And so we walked away. The interview didn’t happen. As protests continue in Iran and people are being killed, it would have been an important moment to speak with President Raisi. 7/7 pic.twitter.com/kMFyQY99Zh — Christiane Amanpour (@amanpour) September 22, 2022 President Raisi “has a history of blood of his hands,” says @hdagres. “There’s a rise in repression in Iran in recent months… [But] Iranians are fed up with the Islamic Republic and as long as things stay as they are, these protests are going to be continuing for years to come.” pic.twitter.com/vy6FpsPpmc — Christiane Amanpour (@amanpour) September 22, 2022 ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఈ నెల మొదటి వారంలో 22 ఏళ్ల వయసున్న మహ్సా అమిని హిజాబ్ అనే యువతిని హిజాబ్ ధరించలేదంటూ పోలీసులు అరెస్ట్ చేయగా.. కస్టడీలోనే ఆమె కన్నుమూయడంతో ఇరాన్ అంతటా నిరసన జ్వాలలు గుప్పుమన్నాయి. మహిళలు జుట్టు కత్తిరించి.. హిజాబ్‌లు తగలబెట్టి తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఇక ఇరాన్ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలతో 31 మంది మృతి చెందినట్లు అనధికార సమాచారం. ఇక ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి.. హిజాబ్ వ్యతిరేక నిరసనలను ‘గందరగోళ చర్య’గా అభివర్ణిస్తున్నారు. స్వేచ్ఛా హక్కు ఇరాన్‌లోనూ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం చోటు చేసుకున్న అల్లర్లను మాత్రం అంగీకరించబోమని ఆయన అంటున్నారు. ఇదీ చదవండి: హూ ఈజ్ హుస్సేన్?.. గిన్నిస్ రికార్డు -
ప్రజాస్వామ్యం మా డీఎన్ఏలోనే!
-
ప్రజాస్వామ్యం మా డీఎన్ఏలోనే!
* మళ్లీ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం: ప్రధాని మోదీ * భారతీయుల శక్తిసామర్థ్యాలు అపరిమితం న్యూఢిల్లీ: మరోసారి ప్రపంచ ఆర్థికశక్తిగా ఎదిగే అవకాశం భారత్‌కు ఉందని, చైనాకు దీటుగా నిలబడగలదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని 125 కోట్ల మంది శక్తిసామర్థ్యాలను సరైన గాడిలో పెట్టేలా తనవద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన తన వైఖరిని స్పష్టం చేశారు. ఆయా అంశాలపై మోదీ స్పందన.. ప్రజాస్వామ్యం.. ప్రజాస్వామ్యం భారతీయుల డీఎన్ఏలోనే ఉంది. ప్రజాస్వామ్య దేశాలు అభివృద్ధి చెందవనడం సరికాదు. పేద కుటుంబంలో పుట్టిన నాలాంటి వ్యక్తి ప్రధాని కాగలిగాడంటే అది ప్రజాస్వామ్యం ప్రసాదించిన శక్తే. (చైనాలో వలె నియంతృత్వం తరహా అధికారాన్ని కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా) భారత్, చైనా సంబంధాలు భారత్ చైనాలానో.. మరోదేశంలానో మారాల్సిన అవసరం లేదు. భారత్.. భారత్‌లానే ఉంటుంది. పూర్వం భారత్‌ను బంగారు బాతుగా అభివర్ణించేవారు. ఆ స్థాయి అభివృద్ధి సాధించే అవకాశం మళ్లీ వచ్చింది. ఇప్పుడు ‘ఆసియాశకం’ ఆరంభమైంది. భారత్, చైనాలు కలసి అభివృద్ధి పథంలో దూసుకుపోతాయి. చైనాపై నాకు విశ్వాసం ఉంది. అది అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తుందని భావిస్తున్నాను. అయినా, సమస్యల విషయంలో భారత్ కళ్లు మూసుకుని లేదు. ‘ఉక్రెయిన్-రష్యా’ సమస్యపై.. ఇరువర్గాలు కూర్చుని, చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలన్నది భారత్ వైఖరి. సమస్యలు వచ్చినప్పుడు సలహాలు చెప్పడానికి చాలామందే ఉంటారు. కానీ గమనిస్తే.. వారే అనేక తప్పులు చేసి ఉంటారు. ఏ తప్పూ చేయని వారే ముందుగా రాయి విసరాలని భారత్‌లో ఒక సామెత ఉంది. అమెరికాతో సంబంధాలు.. భారత్, అమెరికా సంబంధాలను కేవలం ఢిల్లీ, వాషింగ్టన్ల మధ్య సంబంధాలుగా చూడకూడదు. అవి మరింత విస్తృతమైనవి. అదృష్టవశాత్తూ ఇరుదేశాలు ఆ దిశగానే ముందుకు వెళ్తున్నాయి. భారత,అమెరికా దేశాల మధ్య ఎన్నో విషయాల్లో దగ్గరి పోలికలున్నాయి. మహిళలు.. మహిళల గౌరవం విషయంలో రాజీ లేదు. అది మనందరి బాధ్యత. మహిళలకు సమాన స్థాయి, గౌరవం లభించే సంస్కృతి మళ్లీ రావాలి. బాలికా విద్య ముఖ్యమైన విషయం. దానిద్వారా మహిళాసాధికారత సాధ్యమవుతుంది. మహిళలపై హింస విషయంలో రాజకీయ నాయకుల వ్యాఖ్యల వల్ల మరింత నష్టం జరుగుతోంది. యోగా.. మన మనసొకటి ఆలోచిస్తుంటే.. శరీరం మరో పనిలో ఉండటం మనం గమనిస్తుంటాం. యోగాతో ఆ వైరుద్ధ్యాన్ని జయించవచ్చు. శరీరం, మనసు, మైండ్లను యోగా అనుసంధానపరిచి ఏకతాటిపైకి తెస్తుంది. రెండేళ్ల తరువాత.. ప్రజలు మాపై ఉంచిన విశ్వాసం సడలకూడదు. మేమెన్నుకున్న ప్రభుత్వం మా సంక్షేమం కోసం నిజాయితీగా, నిబద్ధదతో పనిచేస్తోందని వారు విశ్వసించాలి. నా మాటలతో కాకుండా, నా చర్యలతో ప్రజల విశ్వాసాన్ని నేను గెలుచుకోగలిగితే.. 125 కోట్ల భారతీయుల శక్తిసామర్ధ్యాలు ఒక్కటై.. భారత్‌ను వృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్తాయి. పనిలోనే ఆనందం.. ‘పని చేయని’ తరహా వ్యక్తిని కాదు. పనిలోనే నేను ఆనందం పొందుతాను. పనిలోనే విశ్రాంతి పొందుతాను. ప్రతీక్షణం ఒక కొత్త విషయం లేదా కొత్త ప్రణాళికలపై ఆలోచన చేస్తుంటాను. ఒక శాస్త్రవేత్త గంటలతరబడి పనిచేస్తూ ఎలా ఆనందాన్ని పొందుతాడో.. పరిపాలనలో నాకు ఆ విధంగా సంతోషం లభిస్తుంది... భారతీయులకు అమిత శక్తిసామర్ధ్యాలున్నాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకునే ‘రోడ్ మ్యాప్’ నా వద్ద ఉంది.