టెహ్రాన్: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాద అభ్యర్థి మసూద్ పెజెష్కియాన్ విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో అతివాద అభ్యర్థి సయీద్ జలీలీని ఓడించి మసూద్ పెజెష్కియాన్ ఘన విజయం అందుకున్నారు. దీంతో, పెజేష్కియాన్ మద్దతుదారులు శనివారం ఉదయం వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.
వివరాల ప్రకారం.. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా వైద్యుడు(హార్ట్ సర్జన్) మసూద్ పెజెష్కియాన్ ఎన్నికయ్యారు. ఇక, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు దాదాపు 30 మిలియన్ల ఓట్లు పోలయ్యాయి. శుక్రవారం ఎన్నికల తర్వాత అధికారులు సమర్పించిన డేటా పెజెష్కియాన్‌ను 16.3 మిలియన్ ఓట్లతో విజేతగా ప్రకటించగా, జలీలీకి 13.5 మిలియన్ల ఓట్లు వచ్చినట్టు అక్కడి ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, ఎంపీ మసూద్ పెజెష్కియాన్ ఎన్నికల ప్రచారంలో పశ్చిమ దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజలు మసూద్‌కు భారీ విజయాన్ని అందించారు.
ఇదిలా ఉండగా.. ఇరాన్‌లో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఆ దేశ గార్డియన్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. నలుగురు అభ్యర్థుల పేర్లను గార్డియన్ కౌన్సిల్ ఆమోదించింది. ఇక, పెజెష్కియాన్ ఎంపీగానే కాకుండా మహ్మద్ ఖతామీ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేశారు. 1980-89 వరకు డాక్టర్‌గా కొనసాగారు. ఇక, సయీద్ జలీలీ ఇరాన్ మాజీ చీఫ్ న్యూక్లియర్ నెగోషియేటర్.
Masoud Pezeshkian wins Iran's presidential race with 16.3M votes, beating Saeed Jalili's 13.5M
Pezeshkian promises outreach to the West. Analysts predict pragmatic foreign policy shifts. Known for his Pro-India & Anti-Pakistan stand
Supporters celebrate in Tehran & other… pic.twitter.com/n5JU2dtZgg— Nabila Jamal (@nabilajamal_) July 6, 2024
మరోవైపు.. ఇరాన్ ఎన్నికల సంఘం నుంచి వచ్చిన డేటా ప్రకారం, ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించబడిన ఏకైక సంస్కరణవాద నాయకుడు పెజెష్కియాన్. ఆయన అభ్యర్థిత్వం గురించి ఇటీవల వరకు పెద్దగా చర్చ జరగలేదు. అయితే మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖతామీ, ఉదారవాది హసన్ రౌహానీల మద్దతు అతని అభ్యర్థిత్వానికి బలాన్నిచ్చింది. ప్రచారం సందర్భంగా పెజెష్కియాన్.. ముఖ్యంగా పశ్చిమ దేశాలతో నిర్మాణాత్మక సంబంధాలను, ప్రపంచంలో ఒంటరిగా ఉన్న ఇరాన్ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించాలని చెప్పుకొచ్చారు. దీంతో, ప్రజల్లో ఆయనపై ఓ నమ్మకం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment