సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా నుంచి పెన్సిల్వేనియా రాష్ట్రం నుంచి జో బైడెన్ ఎన్నిక చెల్లదంటూ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి మైక్ కెల్లీ దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా సుప్రీం కోర్టు విచారించకుండానే కొట్టివేసింది. జో బైడెన్‌కు మెయిల్ ద్వారా ఎక్కువ ఓట్లు వచ్చాయని, మెయిల్ ఓట్లకు రాజ్యాంగపరంగా భద్రత లేనందున పెన్సిల్వేనియా నుంచి ఆయన ఎన్నిక చెల్లదని పిటిషనర్ పేర్కొన్నారు. ఇప్పటికే ఇలాంటి పనికిరాని పిటిషన్లను కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఈ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరమే లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాగా 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మెయిల్ ఓట్ల ద్వారానే విజయం సాధించారు. అప్పుడు చెల్లిన ఓట్లు జో బైడెన్ విషయంలో ఎలా చెల్లకుండా పోతాయని న్యాయవర్గాలు వ్యాఖ్యానించాయి.(చదవండి: ట్రంప్ నోట అదే మాట)
ట్రంప్ ప్రతినిధులు అనవసరంగా కోర్టులను ఆశ్రయించి అబాసు పాలవుతున్నారని పేర్కొన్నాయి. ఇక పెన్సిల్వేనియా నుంచి బైడెన్ 80 వేల మెజారిటీతో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను గెలుచుకున్నారు. ఎందుకైనా మంచిదని జోబైడెన్ విజయాన్ని ఖరారు చేయడం కోసం ఆ రాష్ట్ర ఎలక్టోరల్ కాలేజ్‌కి చెందిన 20 మంది ఎలక్టర్లు డిసెంబర్ 14వ తేదీన సమావేశమవుతున్నారు. కాగా అమెరికా సుప్రీం కోర్టు 9 మంది న్యాయమూర్తులు ఉండగా, వారిలో ఆరుగురు ట్రంప్ నియమించిన వారే. ఆ ఆరుగురు తనవైపు తీర్పు చెబుతారనే ఉద్దేశంతో ట్రంప్, అన్ని రాష్ట్రాల ఎన్నికలపైన సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఆ ఆరుగురిలో ముగ్గురు జడ్జీలు వ్యతిరేకిస్తూ రావడంతో ట్రంప్ పిటిషన్లన్నీ వీగిపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment