సాక్షి, మంగళగిరి: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ఏపీ పర్యటనలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం మధ్యాహ్నం ఏపీకి విచ్చేశారు. అనంతరం ద్రౌపది ముర్ము.. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వారసత్వ కట్టడాలకు ఆంధ్రప్రదేశ్ నిలయం. ఆంధ్రప్రదేశ్‌కు ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై జన్మించారు. ఈక్రమంలో తెలుగు కవులైన నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడలను ముర్ము స్మరించుకున్నారు.
తిరుపతి, లేపాక్షి వంటి ప్రసిద్ధ క్షేత్రాలకు ఏపీ నిలయం. స్వాతంత్ర్య సమరంలో ఏపీకి ఘన చర్రిత ఉంది. ఈ పోరాటంలో రాష్ట్ర మహనీయులు కీలక ప్రాత పోషించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంతో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో ప్రకృతి సహజసిద్దమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని అన్నారు. అనంతరం రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కోరారు ద్రౌపది ముర్ము.
ఇది కూడా చదవండి: సామాజిక న్యాయాన్ని గెలిపిద్దాం: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment