రసవత్తర పోరు.. ‘అంకెల్లో’ అమెరికా అధ్యక్ష ఎన్నికలు | US Presidential Polls 2024: 244 Million Voters And 7 Swing States To Decide The Fate Of Harris Vs Trump | Sakshi
Sakshi News home page

US Elections 2024: రసవత్తర పోరు.. ‘అంకెల్లో’ అమెరికా అధ్యక్ష ఎన్నికలు

Published Tue, Oct 15 2024 7:31 AM | Last Updated on Tue, Oct 15 2024 9:06 AM

US Presidential Polls 244 Million Voters

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. నవంబర్‌లో జరగబోయే ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది, అగ్ర రాజ్యంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వివరాలు అంకెల్లో చూసుకుంటే..

అధ్యక్ష పదవికి ఇద్దరు పోటీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పలువురు పోటీ పడ్డారు. చివరికి ఎన్నికల బరిలో ఇద్దరు నిలిచారు. వారు డెమోక్రాట్ కమలా హారిస్, రిపబ్లికన్ డోనాల్డ్ ట్రంప్​.

నవంబర్‌ ఐదున ఎన్నికలు
2024, నవంబర్ 5 ఎన్నికల రోజు.​ నవంబర్ నెలలో మొదటి సోమవారం తరువాత వచ్చే మంగళవారం నాడు అమెరికాలో సాంప్రదాయకంగా ఎన్నికలు నిర్వహిస్తుంటారు.

ఏడు  స్వింగ్‌ స్టేట్స్‌
స్వింగ్ స్టేట్స్​ సంఖ్య  ఏడు. ఈ రాష్ట్రాల్లో హోరాహోరీ పోరు జరగనుంది. ఈ జాబితాలో అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ఉన్నాయి. అత్యంత రసవత్తరంగా సాగే అధ్యక్ష ఎన్నికల్లో ఈ రాష్ట్రాలు అత్యంత కీలకం. ఈ జాబితాలోని ఏ రాష్ట్రంలోనైనా కొద్ది ఓట్లు తేడాతో అభ్యర్థులు ఓడిపోయే అవకాశాలుంటాయి.

ప్రతినిధుల సభలో 435 స్థానాలు ఖాళీ
34 సెనేట్ స్థానాలు కలిగిన ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా ఓటర్లు అధ్యక్షుడిని  ఎన్నిక చేయడమే కాకుండా, కాంగ్రెస్​ సభ్యులను కూడా ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. సభలోని సభ్యుల పదవీకాలం రెండేళ్లు. ప్రస్తుతం రిపబ్లికన్లకు మెజారిటీ ఉంది. కమలా హారిస్‌కు చెందిన డెమోక్రాట్లు విజయంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. సెనేట్‌లో ఆరేళ్ల పదవీ కాలానికి 100 సీట్లకు గాను 34 సీట్లు ఖాళీగా ఉన్నాయి. స్వల్పంగా ఉన్న డెమొక్రటిక్ మెజారిటీని తిప్పికొట్టాలని రిపబ్లికన్లు  భావిస్తున్నారు.

ఓటర్ల గణాంకాలు
అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో వేర్వేరుగా ఓటర్ల సంఖ్య ఉంది. సభకు ఎంపికయ్యే వారి సంఖ్య జనాభా ప్రాతిపదికన మారుతుంది. ఉదాహరణకు, గ్రామీణప్రాంతమైన వెర్మాంట్‌లో కేవలం మూడు ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే ఉన్నాయి. కాగా కాలిఫోర్నియాలో 54 ఓట్లు ఉన్నాయి. 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో మొత్తం 538 మంది ఓటర్లు ఉన్నారు.

పోల్ వర్కర్ల సంఖ్య
ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం 2020లో అమెరికా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన పోల్ వర్కర్ల సంఖ్య 7,74,000. అమెరికాలో మూడు గ్రూపుల ఎన్నికల సిబ్బంది ఉంటారు. వారు ఓటర్లకు సహాయం చేయడం, ఓటింగ్ పరికరాలను ఏర్పాటు చేయడం, ఓటరు ఐడీలను, రిజిస్ట్రేషన్లను ధృవీకరించడం వంటి పనులు చేస్తారు. వీరిని పోల్ వర్కర్లు  అని అంటారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం లాంటి ప్రత్యేక విధులను నిర్వహించడానికి ఎన్నికల అధికారులు ఉంటారు. బ్యాలెట్ లెక్కింపును పర్యవేక్షించేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల పరిశీలకులను నియమిస్తాయి. 2020లో ఎన్నిక ఫలితాలను అంగీకరించేందుకు నాటి అధ్యక్షుడు ట్రంప్​ నిరాకరించిన నేపధ్యంలో ఇప్పుడు బ్యాలెట్​ లెక్కింపు ప్రక్రియపై మరింతగా దృష్టి కేంద్రీకరించనున్నారు.

244 మిలియన్‌ ఓటర్లు
2024లో ఓటు వేసేందుకు అర్హులైన అమెరికన్ల సంఖ్య 244 మిలియన్‌ (ఒక మిలియన్  అంటే 10 లక్షలు)అని ద్వైపాక్షిక పాలసీ సెంటర్ తెలిపింది. వీరిలో ఎంత మంది ఓటు వేస్తారనేది వేచి చూడాలి. 2018, 2022 మధ్యంతర ఎన్నికలు, 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ లేనంత అత్యధిక ఓటింగ్ నమోదైనట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. 

ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement