వాషింగ్టన్ : అరిజోనా, జార్జియా, పెన్సిల్వేనియా, ఫిలడెల్ఫియా రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అరిజోనాలో డెమొక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి బైడెన్ ముందంజలో ఉండగా.. జార్జియా, పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. అయితే ట్రంప్ ఆధిక్యతకు గంట గంటకు తగ్గిస్తూ బైడెన్ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ ఓట్లు తీసుకొచ్చి తన ఆధిక్యతను తగ్గిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఏది ఏమైనప్పటికి పెన్సిల్వేనియాను చేజిక్కించుకోవటానికి ట్రంప్‌కే అధిక అవకాశాలు ఉన్నాయి. ( ఆ విజయం నా ఒక్కడిదే కాదు: బైడెన్ )
అక్కడ ఇంకా లెక్కపెట్టాల్సిన ఓట్లు దాదాపు 7,65,000 ఉన్నాయి. పెన్సిల్వేనియా సొంతం కావాలంటే ఈ ఓట్లలో ట్రంప్‌నకు 39 శాతం నుంచి 41 శాతం.. బైడెన్‌కు 59 శాతం నుంచి 61 శాతం ఓట్లు రావాల్సి ఉంది. ఇక్కడ మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇక నెవెడాలో ఇప్పటికే ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. అక్కడి ఫలితాలు రావటానికి మరో 24 గంటలు పడుతుందని సమచారం.
Comments
Please login to add a commentAdd a comment