నేనే గెలిచా: డొనాల్డ్‌ ట్రంప్‌ | Donald Trump I WON THE ELECTION Tweets | Sakshi
Sakshi News home page

నేనే గెలిచా: డొనాల్డ్‌ ట్రంప్‌

Nov 16 2020 2:59 PM | Updated on Nov 16 2020 3:54 PM

Donald Trump I WON THE ELECTION Tweets  - Sakshi

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తగిలిన ఎదురు దెబ్బను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  జీర్ణించుకోలేకపోతున్నారు.

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తగిలిన ఎదురు దెబ్బను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిని అంగీకరించేదే లేదని చెబుతున్న ట్రంప్‌ మరోసారి సోషల్‌ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బైడెన్‌ గెలిచినట్టు అంగీకరిస్తూనే, అధ్యక్ష పీఠంకోసం మోసాలకు పాల్పడుతున్నారంటూ వాపోతున్న ట్రంప్‌ తాజాగా తానే గెలిచానంటూ ట్వీట్‌ చేశారు. 'ఐ వన్ ది ఎలక్షన్' అంటూ  సోమవారం ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్‌ చేస్తూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ట్రంప్‌ ట్వీట్‌ను ట్విటర్‌ ఫ్లాగ్ చేసింది. ఈ పోస్ట్ క్రింద ఒక హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. (బైడెన్‌ గెలిచాడని ఒప్పుకున్న ట్రంప్‌!)

అటు ఎన్నికల్లో ఓటమిని అంగీకరించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్రంప్‌నకు సూచించారు. ఫలితాల్ని మార్చే అవకాశమే లేదని, ఇకనైనా తన అహాన్ని పక్కన పెట్టి దేశ హితం కోసం బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. తాజా ఎన్నికల ప్రకారం అమెరికా పూర్తిగా రెండు భాగాలుగా విడిపోయినట్టు స్పష్టమవుతోందనీ, ట్రంప్‌ నిరంతరం అసత్యాలు ప్రచారం చేస్తే ప్రత్యర్థి దేశాలు అమెరికా బలహీన పడిందని భావి‍స్తాయన్నారు. తమ నాయకుడు జో బైడెన్‌ చేతిలో ట్రంప్ చిత్తుగా ఓడిపోయారని డెమొక్రాటిక్ వర్గాలు సంబరాల్లో ముగిని తేలుతున్నసంగతి తెలిసిందే. ఎడిసన్ రీసెర్చ్ ప్రకారం, స్టేట్-బై-స్టేట్ ఎలక్టోరల్ సిస్టంలో బైడెన్‌ 306 ఓట్లను గెల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement