
కేప్ టౌన్: దక్షిణాఫ్రికా ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ రాకపోయినా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా రాజీనామా చేయబోరని పార్టీ స్పష్టం చేసింది. ఐక్య కూటమి ఏర్పాటు చేసి ఆయన సారథ్యంలోనే స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామని పేర్కొంది.
ఎన్నికల్లో ఏఎన్‌సీకి 40 శాతం, డెమొక్రటిక్ అలయెన్స్‌కు 20 శాతం, మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా సారథ్యంలోని ఎంకే పార్టీకి 14 శాతం ఓట్లు రావడం తెలిసిందే. 1994లో వర్ణ వివక్ష అంతమైన ఎన్నికలు జరిగినప్పటి ఏఎన్‌సీకి మెజారిటీ రాకపోవడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment