United Alliance
-
రామఫోసా గద్దెదిగే ప్రసక్తే లేదు: ఏఎన్సీ
కేప్ టౌన్: దక్షిణాఫ్రికా ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్కు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ రాకపోయినా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా రాజీనామా చేయబోరని పార్టీ స్పష్టం చేసింది. ఐక్య కూటమి ఏర్పాటు చేసి ఆయన సారథ్యంలోనే స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామని పేర్కొంది. ఎన్నికల్లో ఏఎన్సీకి 40 శాతం, డెమొక్రటిక్ అలయెన్స్కు 20 శాతం, మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా సారథ్యంలోని ఎంకే పార్టీకి 14 శాతం ఓట్లు రావడం తెలిసిందే. 1994లో వర్ణ వివక్ష అంతమైన ఎన్నికలు జరిగినప్పటి ఏఎన్సీకి మెజారిటీ రాకపోవడం ఇదే తొలిసారి. -
13న విపక్షాలతో సోనియా భేటీ!
న్యూఢిల్లీ/చెన్నై: బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సమైక్య కూటమి ఏర్పాటుపై చర్చించేందుకు ఈనెల 13న విందు సమావేశం ఏర్పాటు చేశారని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. పార్లమెంటులో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఆందోళన కొనసాగిస్తున్న తరుణంలో.. ఆ ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు, అలాగే 2019 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఈ విందు భేటీని వేదికగా వాడుకోవాలని సోనియా యోచిస్తున్నారని ఆ నేత తెలిపారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటుపై సంప్రదింపులకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ సహా అందరు కీలక ప్రతిపక్ష నేతలతో చర్చలకు సోనియా ఆసక్తిగా ఉన్నారన్నారు. ఎన్నికలకు ముందు చెపుతాం: డీఎంకే కేంద్రంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయమైనా లోక్సభ ఎన్నికలకు ముందు మాత్రమే తీసుకుంటామని బెంగాల్ సీఎం మమతకు చెప్పినట్లు డీఎంకే తెలిపింది. -
190 సంఘాలతో ఐక్యకూటమి: తమ్మినేని
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేసేందుకు 190 సంఘా లతో ఐక్య కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం ఓయూ క్యాంపస్ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమి నార్ హాల్లో తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పలు విధివిధానాలపై చర్చ జరిగింది. కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ నాయకుడు ఆర్ఎల్ మూర్తి అధ్యక్షత వహించగా తమ్మినేని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాజకీయ పార్టీలకతీతంగా వివిధ ప్రజా సంఘాలు, కుల, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 190 సంఘాలతో ఐక్యవేదికను ఏర్పాటు చేయనున్నట్లు తమ్మినేని చెప్పారు.