న్యూఢిల్లీ/చెన్నై: బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సమైక్య కూటమి ఏర్పాటుపై చర్చించేందుకు ఈనెల 13న విందు సమావేశం ఏర్పాటు చేశారని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. పార్లమెంటులో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఆందోళన కొనసాగిస్తున్న తరుణంలో.. ఆ ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు, అలాగే 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఈ విందు భేటీని వేదికగా వాడుకోవాలని సోనియా యోచిస్తున్నారని ఆ నేత తెలిపారు.
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటుపై సంప్రదింపులకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ సహా అందరు కీలక ప్రతిపక్ష నేతలతో చర్చలకు సోనియా ఆసక్తిగా ఉన్నారన్నారు. ఎన్నికలకు ముందు చెపుతాం: డీఎంకే కేంద్రంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయమైనా లోక్‌సభ ఎన్నికలకు ముందు మాత్రమే తీసుకుంటామని బెంగాల్ సీఎం మమతకు చెప్పినట్లు డీఎంకే తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment