న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్లింగ్టన్ నేషనల్ స్మశానవాటిక సందర్శన చర్చనీయాంశంగా మారింది. సైనికుల స్మశానవాటిక సందర్శన వీడియోలు, ఫొటోలను ట్రంప్ బృందం అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవటంపై ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తీవ్రంగా ఖండించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మరణించిన పలువురు యూఎస్ సైనికుల పవిత్రమైన స్థలాన్ని ట్రంప్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారామె.
‘‘ ఆర్లింగ్టన్ నేషనల్ స్మశానవాటిక.. అమెరికన్ హీరోలను గౌరవించటానికి పవిత్రమైన ప్రదేశం. రాజకీయాలకు సంబంధించిన స్థలం కాదు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ సైనికుల పవిత్రమైన స్థలాన్ని అవమానించారు. పోలిటికల్ స్టంట్ కోసం ట్రంప్ ఇలా చేశారు. ఇలా చేయటం ట్రంప్‌కు కొత్త కాదు. ఆయన దేశ సైనికులను ఓడిపోయినవారని పేర్కొన్నారు. ఇలా ఆయన ఎందుకు అన్నారో నాకు అర్థం కావటం లేదు. మెడల్ ఆఫ్ హానర్ గ్రహీతలను అవమానించారు. తనకు తాను సేవ చేసుకోవటం తప్ప మరొకటి తెలియని వ్యక్తి ట్రంప్.
అమెరికన్లుగా మనమంతా ఏకీభవించాల్సిన విషయం ఏమిటంటే..దేశానికి సేవచేసిన అనుభవజ్ఞులు, సైనికులు, వారి కుటుంబ సభ్యులను గౌరవించాలి. ఎప్పుడూ అవమానించరాదు. అత్యున్నత గౌరవం, కృతజ్ఞత ఇచ్చేలా చూడాలి. సైనికుల త్యాగాన్ని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. వారికి సంతాపం తెలియజేస్తున్నా. వారిని ఎప్పుడూ రాజకీయల కోసం ఉపయోగించుకోను’’ అని కమల అన్నారు.
As Vice President, I have had the privilege of visiting Arlington National Cemetery several times. It is a solemn place; a place where we come together to honor American heroes who have made the ultimate sacrifice in service of this nation.
It is not a place for politics.
And…— Kamala Harris (@KamalaHarris) August 31, 2024
సోమవారం ఆర్లింగ్టన్ నేషనల్ స్మశానవాటికను ట్రంప్ సందర్శించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మరణించిన పలువురు యూఎస్ సైనికులకు ఆయన నివాళులు అర్పించి, మృతుల కుటుంబసభ్యులతో ఫొటోలు దిగారు. అయితే అది కేవలం ప్రచారం కోసమే ట్రంప్ యూఎస్ సైనికులకు నివాళులర్పించేందుకు వచ్చారని యూఎస్ ఆర్మీ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఆర్మీ ఆరోపణలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం స్మశానవాటిను సందర్శించలేదని తెలిపారు. తాను ఎన్నికల్లో గెలవడానికి అలాంటి ప్రచారం అవసరం లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment