న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 10న అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగబోయే డిబేట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ డిబెట్‌పై ట్రంప్ స్పందిస్తూ.. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో డిబెట్ కోసం ఒప్పదం కుదుర్చుకున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో వెల్లడించారు.
‘కామ్రేడ్ కమలా హారిస్‌తో సెప్టెంబర్ 10న ఫిలడెల్ఫియాలో జరిగే డిబేట్ కోసం నేను రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్‌లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను. ఈ డిబేట్ ఏబీసీ ఫేక్ న్యూస్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అయితే న్యూస్ సంస్థ మాత్రం చాలా అన్యాయమైంది’ అని అన్నారు. నిబంధనల విషయంలో ట్రంప్ ఈ డిబేట్‌ను రద్దు చేస్తారని వార్తలు వెలుడిన ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్ 27 సీఎన్‌ఎన్‌లో తాను, అధ్యక్షుడు జో బిడెన్‌తో తలపడిన డిబేట్ నియమాలే.. కమలతో జరిగే డిబేట్‌లో ఉంటాయని తెలిపారు. వాటిని తాను పాటించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నానని తెలిపారు.
‘‘సీఎన్‌ఎన్ డిబేట్ నిబంధనలే ఉంటాయి. అయితే ఈ నిబంధనలు ప్రెసిడెంట్ జో బైడెన్‌కు మినహా అందరికీ బాగా అనిపించాయి. డిబేట్‌లో అభ్యర్థులు నిలబడి మాట్లాడుతారు. అభ్యర్థులు నోట్స్ లేదా షీట్లు తీసుకురావటం ఉండదు. ఇక.. ఈ డిబేట్ న్యాయమైన చర్చగా ఉంటుందని ఏ పక్షానికి ముందుగానే ప్రశ్నలు ఇవ్వటం జరగదని ఏసీబీ ద్వారా మాకు హామీ ఇచ్చింది’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment