
వాషింగ్టన్: ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ డిబెట్‌లో ట్రంప్ ధాటికి బైడెన్ తేలిపోయారు. ఈ నేపథ్యంలో చర్చ రోజున ఏం జరిగిందో బైడెన్ క్లారిటీ ఇచ్చారు. తాను భయంకరమైన అనుభూతికి లోనైనట్టు బైడెన్ చెప్పుకొచ్చారు.
కాగా, బైడెన్ తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడూతూ..‘ట్రంప్‌తో చర్చ రోజున నేను ఆనారోగ్యంతో ఉన్నాను. తీవ్రమైన జలుబు కారణంగా అస్వస్థతకు లోనయ్యారు. అది నాకు భయంకరమైన అనుభూతి. అనారోగ్యం కారణంగానే నేను బాగా మాట్లాడలేకపోయాను. కానీ, నేను రేసులో ఉన్నాను. ట్రంప్‌ను కచ్చితంగా ఓడించగలను’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. ట్రంప్‌తో చర్చలో భాగంగా బైడెన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు. ఈ చర్చలో ట్రంప్ పైచేయి సాధించాడని పలు మీడియా సంస్థలు కూడా పేర్కొన్నాయి. దీంతో, ఎన్నికల నుంచి బైడెన్ తప్పుకోవాలనే చర్చ మొదలైంది. కానీ, వైట్ హౌస్ వర్గాలు మాత్రం బైడెన్ రేసులో ఉంటారని చెప్పుకొచ్చాయి. ఇక, బైడెన్ కూడా తాను పోటీలోనే ఉంటానని స్పష్టం చేశారు.
I'm not letting one 90-minute debate wipe out three and a half years of work.
I'm staying in the race, and I will beat Donald Trump. pic.twitter.com/5VZHf4N4xj— Joe Biden (@JoeBiden) July 5, 2024
మరోవైపు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారపర్వంతో అలసిపోతున్నారట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించారు. తాను నిద్రపోవడానికి మరింత సమయం కావాలని, రాత్రి ఎనిమిది తర్వాత ఎలాంటి ప్రచారంలో పాల్గొనలేనని, అర్ధరాత్రి కార్యక్రమాలు వద్దని చెప్పారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో జరిగిన సమావేశంలో బైడెన్ తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చలో బైడెన్ తడబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన తడబాటుకు గల కారణాన్ని బైడెన్ ఇదివరకే వెల్లడించారు. తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని తెలిపారు. దాని వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందని పేర్కొన్నారు. అందుకే చర్చలో సరిగా వాదించలేకపోయినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment