న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఇండో అమెరికన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు ట్రంప్‌పై కమల పైచేయి సాధిస్తూనే ఉన్నారు. ఇండో-అమెరికన్లు అధికంగా ఉండే పలు రాష్ట్రాలోని ఓటర్లు కమలకు అనుకూలంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. తాజాగా ‘‘హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్’’ అనే సంస్థ తమ పూర్తి మద్దతును మాజీ ప్రెసిండెంట్ డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రకటించింది.
అంతేకాకుండా కీలకమైన రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా , నార్త్ కరోలినాలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉత్సవ్ సందుజా తెలిపారు. కమల అమెరికా అధ్యక్ష ఎన్నికల గెలుపొందితే.. భవిష్యత్తులో భారత-అమెరికా సంబంధాలు అస్థిరంగా మారుతాయని వ్యాఖ్యానించారు.
‘‘కమల అమెరికా ప్రెసిడెంట్ అయితే పలు కీలకమైన పదువుల్లో ఆమె నియమించే వ్యక్తుల వల్ల ఆసియా-అమెరికా ఓటర్లపై తీవ్ర ప్రభావం ఎదుర్కొనున్నారు. ఇప్పటికే ప్రెసిడెంట్ జోబైడె ప్రభుత్వం దేశసరిహద్దు భద్రత, వలసదారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వలసలు పెరగటం వల్ల క్రైం రేటు పెరిగింది. మైనార్టీలు ముఖ్యంగా ఆసియా-అమెరికా వ్యాపారులు ప్రతికుల ప్రభావాలు ఎదుర్కొటుంన్నారు’ అని అన్నారు.
‘‘డొనాల్డ్ ట్రంప్ మాత్రం వలస విధానాలు అమలు చేయటంలో పక్కాగా ఉంటారని తెలిపారు. భారత్ నుంచి రక్షణ, టెక్నాలజీ, సహకారం పెంచుకోవటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ట్రంప్ భారత అనుకూలవాది. భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో సంబంధాలను పెంపొందించుకోగలిగారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో అద్భుతమైన సంబంధాన్ని పెంపొందించుకోగలిగారని, చైనాపై భారత్‌ను ఢీకొనేందుకు వీలుగా అనేక రక్షణ ప్రాజెక్టులకు సహకరించారు.
చైనాను భారత్ ఢీకొనేందుకు వీలుగా అనేక రక్షణ ప్రాజెక్టులకు సహకరించారు. భారత ప్రభుత్వం, ప్రజల గురించి కమల అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ మాత్రం భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. భారత్-అమెరికా సంబంధాలకు కమల అస్థిరత కలిగిస్తారు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment