
న్యూయార్క్: రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ డొనాల్డ్‌ట్రంప్ మళ్లీ తన పాత విధానాలైన విభజన సిద్ధాంతం, అగౌరవపర్చే ధోరణినే ప్రదర్శిస్తున్నారు. అందుకే ఇలాంటివారు కాకుండా అమెరికా ప్రజలకు ఉత్తమమైన నాయకులు రావాలి.
.. మన వైవిధ్యాలు మనల్ని విడదీయకూడదు. ఐకమత్యంగా ఉంచాలి. అదే మన బలం. వాస్తవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం, కోపంతో స్పందించేవారు మనకు వద్దు. వాస్తవాలను అంగీకరించి వాటిని ధైర్యంగా చెప్పే నాయకులు కావాలి’’ అని కమలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment