న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పోటీకి సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం ఆమె జార్జియాలోని అట్లాంటా సిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన డిబేట్ విషయంలో ట్రంప్ ఎదైనా చెప్పదల్చుకుంటే ముఖం మీద సూటిగా చెప్పాలని ఛాలెంజ్ విసిరారు. తాను అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత ఎన్నికల స్వరూపం మారిపోయిందని అన్నారామె.
‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మార్పు వచ్చింది. ఈ మార్పు సంకేతాలను డొనాల్డ్ ట్రంప్ గమనించారు. గతవారం సెప్టెంబర్‌లో డిబేట్ సిద్ధమన్న ట్రంప్.. ప్రస్తుతం వైదొలిగారు. నాతో డిబేట్‌లో పాల్గొనడానికి మీరు( డొనాల్డ్ ట్రంప్) పునరాలోచిస్తున్నానని తెలుస్తోంది. అయితే మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే నా ముఖం మీద సూటిగా చెప్పాలి. ట్రంప్ ఆయన రన్నింగ్ మేట్(ఉపాధ్యక్ష అభ్యర్థి) డిబేట్ చేయలనుకోరు. కానీ, నా గురించి ఏదో ఒకటి మాట్లాడాలని వాళ్లు చూస్తారు’ అని అన్నారు. కమలా హారిస్ పాల్గొన్న ఈ ర్యాలీలో 10 వేల మంది ప్రజలు హాజరయ్యారు.
జార్జియా ప్రజలు మద్దతు తెలిపితే అధ్యక్ష ఎన్నికల్లో గెలువటం సులువు అవుతుంది. 2020 ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఇక్కడి ప్రజలు తమకు మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో సైతం డెమోక్రటిక్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. ఈ ఎన్నికలు మనకు ట్రంప్‌కు మాత్రమే కాదని అన్నారు. దేశ భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్లకు, దేశాన్ని తిరోగమనంలోకి తీసుకువెళ్లారికి మధ్య జరగనున్నాయని కమలా హారిస్ అన్నారు.
మరోవైపు.. ప్రచారం ప్రారంభించిన వారం వ్యవధిలోనే దాదాపు 20 కోట్ల డాలర్లను కమలా బృందం సేకరించడం గమనార్హం. దేశ అధ్యక్షుడు జో బైడెన్ రేసు నుంచి వైదొలిగిన అనంతరం.. కమలా హారిస్‌కు డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీకి మార్గం సుగమమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment