
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ఏపీ పర్యటనలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం మధ్యాహ్నం ఏపీకి చేరుకున్నారు. అనంతరం ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్టేజీపై సీఎం వైఎస్ జగన్.. ద్రౌపది ముర్ముకు పుష్ఫగుచ్చం అందించి శాలువతో సత్కరించారు.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ మద్దతు పలకడం సంతోషం. అందరితో చర్చించాకే ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించాము. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి ట్రైబల్ మహిళకు అవకాశం లభించింది. పార్టీలకు అతీతంగా ముర్ముకు అందరం మద్దతు పలకాలి’’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment