
Updates..
► విమానాశ్రయంలో స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.
► మంత్రి తలసాని, మల్లారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్వాగతం పలికారు.
► ద్రౌపది ముర్ము బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రీవ్యూయింగ్ ఆఫీసర్‌గా హాజరవుతారు. పరేడ్ అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతారు.
Comments
Please login to add a commentAdd a comment