ఫైల్ ఫోటో
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము మంచి ఆరోగ్యం, ఆనందంతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. యావత్ జాతికి ద్రౌపదిముర్ము నిజమైన స్ఫూర్తి అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు.
My greetings and best wishes to the Honourable President Smt Droupadi Murmu garu on the occasion of her birthday. I wish the Honourable President good health and happiness. You are a true inspiration to the entire nation Madam. @rashtrapatibhvn
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 20, 2023
కాగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము 1958 జూన్ 20న మయుర్‌భంజ్ జిల్లాలో ఉపార్ బెడ గ్రామంలో జన్మించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కూమార్తె ఉన్నారు. ఆమె ఇద్దరు కుమారులు మృతిచెందారు. ముర్ముకు కుమార్తె ఇతిశ్రీ ఉన్నారు. భర్త శ్యామ్ చరణ్ ముర్ము కూడా గుండెపోటుతో మరణించారు. రాష్ట్రపతికి ముందు జార్ఖండ్ తొమ్మిదవ గవర్నర్‌గా పనిచేశారు.
సంతాల్ తెగకు చెందిన ముర్ము.. భారత రెండో మహిళా రాష్ట్రపతిగా నిలిచారు.. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు. అంతకుముందు.. భారత ప్రథమ మహిళగా ప్రతిభా సింగ్ పాటిల్ బాధ్యతలు నిర్వర్తించారు.
చదవండి: చంద్రబాబు మారణహోమంలో పవన్ బలి అవుతాడేమో!
Comments
Please login to add a commentAdd a comment