birthday whises
-
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ముకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. My warm wishes and greetings to the honourable President of India Smt Droupadi Murmu garu @rashtrapatibhvn on her birthday.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 20, 2024 -
సీఎం జగన్‌కు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సీఎం జగన్‌ను విష్ చేశారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు సీఎం జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎత్తున సేవా కార్యక్రమాలను వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. Birthday wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu. May he lead a long and healthy life. — Narendra Modi (@narendramodi) December 21, 2023 గవర్నర్ శుభాకాంక్షలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. I extend my heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh on his Birthday. pic.twitter.com/75KTexNMbI — governorap (@governorap) December 21, 2023 -
రాష్ట్రపతి ముర్ముకు సీఎం జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము మంచి ఆరోగ్యం, ఆనందంతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. యావత్ జాతికి ద్రౌపదిముర్ము నిజమైన స్ఫూర్తి అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. My greetings and best wishes to the Honourable President Smt Droupadi Murmu garu on the occasion of her birthday. I wish the Honourable President good health and happiness. You are a true inspiration to the entire nation Madam. @rashtrapatibhvn — YS Jagan Mohan Reddy (@ysjagan) June 20, 2023 కాగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము 1958 జూన్ 20న మయుర్‌భంజ్ జిల్లాలో ఉపార్ బెడ గ్రామంలో జన్మించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కూమార్తె ఉన్నారు. ఆమె ఇద్దరు కుమారులు మృతిచెందారు. ముర్ముకు కుమార్తె ఇతిశ్రీ ఉన్నారు. భర్త శ్యామ్ చరణ్ ముర్ము కూడా గుండెపోటుతో మరణించారు. రాష్ట్రపతికి ముందు జార్ఖండ్ తొమ్మిదవ గవర్నర్‌గా పనిచేశారు. సంతాల్ తెగకు చెందిన ముర్ము.. భారత రెండో మహిళా రాష్ట్రపతిగా నిలిచారు.. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు. అంతకుముందు.. భారత ప్రథమ మహిళగా ప్రతిభా సింగ్ పాటిల్ బాధ్యతలు నిర్వర్తించారు. చదవండి: చంద్రబాబు మారణహోమంలో పవన్ బలి అవుతాడేమో! -
సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: నేడు(ఫిబ్రవరి 17) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఈరోజు ఆయన 69వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Birthday greetings to Telangana CM Shri KCR Garu. I pray for his long life and good health. @TelanganaCMO — Narendra Modi (@narendramodi) February 17, 2023 అదే విధంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి, జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గౌరవనీయులైన @TelanganaCMO శ్రీ కె చంద్రశేఖర్ రావుగారికి జన్మదిన శుభాకాంక్షలు. — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 17, 2023 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో మీ జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను pic.twitter.com/YtwzOsdsUP — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) February 17, 2023 -
సీఎం జగన్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు నేడు (మంగళవారం). ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని పలువురు ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం జగన్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. జీవితాంతం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు వేడుకలు నిర్వహిస్తున్నారు. ట్విట్టర్లో #HBDManOfMassesYSJagan హ్యాష్ ట్యాగ్‌తో విషెస్ మోత మోగిస్తున్నారు. తమ ప్రియతమ నేత పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు Greetings to AP CM Shri @ysjagan Garu on his birthday. May Almighty bless him with a long and healthy life. — Narendra Modi (@narendramodi) December 21, 2021 -
Ram Pothineni: ఆ ఘనత సాధించిన ఏకైక సౌత్ హీరో రామ్ ఒక్కడే
సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఎంతో కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకునన హీరో రామ్ పోతినేని. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. యాక్టింగ్‌తో పాటు స్టయిల్‌ను, ఎనర్జీని జోడించి వెండితెరపై కిర్రాక్ పుట్టించే యంగ్ హీరోల్లో రామ్‌ఒకరు. నేడు (మే 15) రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. రామ్ పోతినేని మే 15, 1988న మురళీ పోతినేని, పద్మశ్రీ దంపతులకు జన్మించారు. ప్రముఖ సినీ నిర్మాత ‘స్రవంతి’రవికిశోర్ తమ్ముడే మురళీ పోతినేని. పెదనాన్న అడుగుజాడల్లో నడుస్తూ.. సినిమాలపై వైపు వచ్చాడు. 2002లో తమిళంలో తెరకెక్కిన అడయాళం అనే షార్ట్ ఫిలిమ్‌తో రామ్ తన యాక్టింగ్ కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత వైవీఎస్ చౌదరీ దర్శకత్వం వహించిన దేవదాస్(2006) సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాలోనే రామ్ అదరగొట్టాడు. తన నటన, డ్యాన్స్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా హిట్‌తో రామ్‌కి తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే రామ్ మాత్రం కథలను ఆచితూచి ఎంచుకున్నాడు. రెండో చిత్రం ‘జగడం’ప్లాపును మూట గట్టుకున్నప్పటికీ.. రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత 2008లో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘రెడీ’చేసి బాక్సాఫీస్ వద్ద సత్తాచాటాడు. అయితే ఆ తర్వాత రామ్‌కి పెద్దగా హిట్లు లభించలేదు. అతను నటించిన ‘మస్కా’, ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’, ‘హైపర్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించాయి. ఇక 2019లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా గ్రాండ్ సక్సెస్‌ని మూటగట్టుకుంది. ఈ సినిమా తొలి రోజే రూ.10 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను, 8 కోట్లకు పైగా షేర్‌ను సాధించడం విశేషం. ఈ చిత్రం ద్వారా తన బాక్సాఫీస్ పవర్‌ను 100 కోట్ల చేర్చాడు ఈ ఇస్మార్ట్ హీరో. అంతే కాదు ఈ సినిమాను డబ్ చేసి హిందీలో వదిలితే.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 100 మిలియన్ల వ్యూస్‌తో అదరగొట్టింది. అంతేకాకుండా హిందీలోకి డబ్ చేసిన ఆయన నాలుగు చిత్రాలు 100 మిలియన్ల వ్యూస్‌ను నమోదు చేసుకోవడం ఓ రికార్డు. దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు సినిమాలను 100 మిలియన్ల వ్యూస్‌కు చేర్చిన తొలి హీరోగా ఘనతను దక్కించుకొన్నారు. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ ఏడాది ‘రెడ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అతను తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా అతని కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇలాగే సినీ కేరీర్ రామ్ దూసుకెళ్తూ మరిన్ని రికార్డుకు క్రియేట్ చేయాలని ‘సాక్షి’ తరపున ఆయనకు బర్త్‌డే విషెష్ అందజేస్తుంది. -
నా బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ ఇది
‘‘చరణ్.. నీ వయసెంతో నాకు సరిగ్గా తెలియదు. కానీ నిన్ను ఎప్పుడు చూసినా 18 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటావు’’ అని రామ్‌చరణ్ దిల్ ఖుష్ చేశారు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్. బుధవారం (మార్చి 27) రామ్‌చరణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా చరణ్ కోసం ఓ స్పెషల్ బర్త్‌డే విషెస్‌ను వీడియో రూపంలో అందించారు. ‘‘ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చరణ్. ఈ సందర్భంగా నీకు ఆల్ ది బెస్ట్ చెప్పదలచుకున్నాను. నువ్వు చేసే ప్రతీ పనిలో సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా నేను, నా కుటుంబం మొత్తం కోరుకుంటున్నాం. నువ్వు వండర్ఫుల్ పర్సన్‌వి. అలానే ఎప్పుడూ 18ఏళ్ల కుర్రాడిలానే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని వీడియోలో తెలిపారు. వీడియో చివర్లో ‘‘నీ మాతృభాషలో శుభాకాంక్షలు చెప్పకపోతే ఎలా? పుట్టినరోజు శుభాకాంక్షలు చరణ్’’ అని తెలుగులో చెప్పడం విశేషం. ఈ వీడియో మెసేజ్‌కు రామ్‌చరణ్ స్పందిస్తూ – ‘‘థ్యాంక్యూ అమితాబ్ బచ్చన్‌గారు. నాకు లభించిన బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ మీ విషెస్. మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియోలో మీరు అన్న ప్రతీ మాటను నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఒకవేళ యంగ్‌గా కనిపించడానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉండాలంటే అది కచ్చితంగా మీరే’’ అన్నారు. చిరంజీవి హీరోగా రామ్‌చరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘సైరా’. ఈ సినిమాలో చిరంజీవికి గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్న విషయం తెలిసిందే. -
తాప్సీ... నువ్వేదో మంచి చేసి ఉంటావ్!
ఇలా తన గురించి తానే అంటున్నారు తాప్సీ. మంగళవారం తన పుట్టినరోజు జరుపుకున్నారామె. ఈ సందర్భంగా అభిమానుల నుంచి లెక్కలేనన్ని ‘బర్త్‌డే విషెస్’ అందుకున్నారు. ఆ ఆనందంలో తలమునకలవుతున్నారీ ఢిల్లీ బ్యూటీ. ఎమోషన్ని మాటల రూపంలో బయటపెట్టారు. ‘‘మీ (అభిమానులు) అందర్నీ నేరుగా కలసి, ధన్యవాదాలు తెలియజేయాలని ఉంది. కానీ, అది సాధ్యం కాదు. అందుకే సోషల్ మీడియా ద్వారా నా ఆనందాన్ని పంచుకుంటున్నా. మీకు ధన్యవాదాలు చెప్పడానికి మాటలు లేవు. ‘తాప్సీ.. నువ్వేదో మంచి పని చేసి ఉంటావ్. అందుకే ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకోగలిగావ్’ అని నన్ను నేను అభినందించుకుంటున్నాను. నటిగా తడబడుతూ అడుగులేసినప్పటి నుంచి ‘నటి’గా నిలదొక్కుకునే వరకూ నన్ను సపోర్ట్ చేశారు. చేస్తూనే ఉన్నారు. ఈ ప్రేమాభిమానాలతో ధైర్యంగా ముందుకెళతాను’’ అని తాప్సీ అన్నారు.