సీఎం జగన్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు | PM Narendra Modi Wishes AP CM YS Jagan On His Birthday | Sakshi
Sakshi News home page

CM Jagan Birthday: సీఎం జగన్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

Published Tue, Dec 21 2021 10:55 AM | Last Updated on Wed, Dec 22 2021 7:43 AM

PM Narendra Modi Wishes AP CM YS Jagan On His Birthday - Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు నేడు (మంగళవారం). ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని పలువురు ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం జగన్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. జీవితాంతం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్‌ చేశారు.

మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు వేడుకలు నిర్వహిస్తున్నారు. ట్విట్టర్‌లో #HBDManOfMassesYSJagan హ్యాష్ ట్యాగ్‌తో విషెస్ మోత మోగిస్తున్నారు. తమ ప్రియతమ నేత పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు.
చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement