న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పోటాపోటీగా దూసుకుపోతున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ ఈ ఇద్దరి మధ్య జరగబోయే డిబేట్ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు ఎస్తోంది. తాజాగా ఈ డిబేట్‌పై కమలా హారిస్ భర్త డగ్లస్ ఎంహోఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కమలా హారిస్‌తో ట్రంప్ డిబేట్ సమీపిస్తున్న నేపథ్యంలో మీ స్పందన ఏమిటని మీడియా అడిగిన ప్రశ్నకు డగ్లస్ ఎమ్‌హోఫ్ మాట్లాడారు. ‘ఇప్పటివరకు మా మధ్య జరిగే చర్చలు, వాదనల్లో నేను ఒక్కసారి కూడా గెలవలేదు. ఆమె చాలా గొప్ప డిబేటర్. ఫస్ట్ క్లాస్ ట్రయల్ లాయర్’ అని అన్నారు. కమలా హారిస్ రాజకీయాల్లోకి రాకముందు హారిస్ దంపతులు న్యాయవాదులుగా పని చేశారు. హారిస్ శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా విధులు నిర్వర్తించారు.
ఇక.. ఏబీసీ న్యూస్ సెప్టెంబర్ 10న రాత్రి 9 గంటలకు ఉపాధ్యక్షురాలు హారిస్‌కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధ్యక్ష ఎన్నికల రెండో డిబేట్‌ను నిర్వహించనుంది. ఇరునేతలు ముఖాముఖి డిబేట్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఫిలడెల్ఫియాలోని జాతీయ రాజ్యాంగ కేంద్రంలో ఈ డిబేట్ జరుగుతుంది.
తొలి డిబేట్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌పై ట్రంప్ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎన్నికల నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేయటంతో వైదొలిగారు. అనంతరం అధ్యక్ష బరిలో దిగిన ఉపాధ్యక్షురాలు కమల ప్రస్తుతం ప్రచారంలో దూసుకువెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment