వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్‌లు కఠిన నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ సంస్థల నిర్వహణ కోసం తాత్కాలికంగా నిధులు కేటాయించే స్టాప్‌గ్యాప్ ఫండింగ్‌ను నిలిపివేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లును వ్యతిరేకించాలని యూఎస్ కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ పార్టీ సెనేటర్లకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లుకు ఆమోదం లభిస్తే.. ప్రభుత్వ సంస్థల నిర్వహణకు నిధుల కేటాయించడం అసాధ్యం. నిధులు లేకపోతే ప్రభుత్వ సంస్థలు తాత్కాలికంగా మూతపడతాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ట్రంప్ పాలక వర్గం కసరత్తు చేస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఈ లోపు స్టాప్ గ్యాప్ ఫండింగ్ బిల్లును నిలిపివేస్తే నిధులు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోన్నాయి. ఆ ప్రభావం క్రిస్మస్‌తో పాటు ఇతర ప్రజా సేవలపై ప్రభావం పడనుంది. దీంతో పాటు పలు ప్రభుత్వ సంస్థలు తాత్కాలికంగా మూతపడే అవకాశం ఉంది. విమానయానం,పాస్‌పోర్ట్ సేవలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌లు, ట్రాన్స్‌ఫోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌లో స్క్రీనర్‌లు పనిచేయవు. ఫలితంగా ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణికులు ఎదురు చూపులు తప్పవు.
ప్రభుత్వ షట్‌డౌన్ సమయంలో ఉద్యోగుల తొలగింపు ఉంటుంది. వారందరూ విధులు ఆపేసి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. నిధులు పునరుద్ధరించబడిన తర్వాత వారికి జీత భత్యాల చెల్లింపులు జరగనున్నాయి. సిబ్బందిని తగ్గించడం వల్ల విమానాలు ఆలస్యం, రద్దు కావచ్చు. కస్టమ్స్, సరిహద్దు రక్షణ వంటి ఇతర విమానాశ్రయ సేవలు కూడా ప్రభావితం కావచ్చు. రవాణా రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రయాణ ఛార్జీలు పెరుగుతాయి. దీంతో పాటు ప్రభుత్వ సేవలు అందించే అన్నీ రంగాలపై దెబ్బ పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment