ప్రపంచానికి భద్రతనిచ్చారు: వాన్స్
ఉపాధ్యక్ష అభ్యర్థుల వాడీవేడి డిబేట్
వాషింగ్టన్: అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విధానాలన్నీ అమెరికాకు తీవ్రంగా చేటు చేశాయని డెమొక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్జ్ విమర్శించారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీకి అత్యంత సమీపానికి వచ్చిందంటే ఆయన అసమర్థతే కారణమన్నారు. ఈ ఆరోపణలను ఆయన ప్రత్యర్థి, రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి జె.డి.వాన్స్ తోసిపుచ్చారు.
అధ్యక్షునిగా ట్రంప్ పాలనా దక్షత వల్లే ప్రపంచం ఇప్పుడింత సురక్షితంగా ఉందని చెప్పుకొచ్చారు. ఆయన హయాంలో ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు, యుద్ధ భయాలు తలెత్తలేదన్నారు. మంగళవారం రాత్రి సీబీఎస్ న్యూస్ వార్తా సంస్థ వేదికగా జరిగిన ఉపాధ్యక్ష అభ్యర్థుల డిబేట్‌లో వారిద్దరూ తలపడ్డారు.
‘‘ట్రంప్ అస్థిర మనస్కుడు. పాలనకు పూర్తిగా అనర్హుడని ఆయనతో కలిసి పని చేసిన అత్యున్నత స్థాయి అధికారులంతా ముక్త కంఠంతో చెప్పారు. మా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌లో గొప్ప నాయకత్వ లక్షణాలున్నాయి’’ అని వాల్జ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment