న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆధార్ టోల్ ఫ్రీ నంబర్ 1800–300–1947 డీఫాల్ట్‌గా చేరింది. తమ ప్రమేయం లేకుండా ఫోన్ల కాంటాక్ట్ లిస్ట్‌లో టోల్ ఫ్రీ నంబర్‌ను చేర్చడం ఏంటని ప్రజలు సోషల్‌మీడియాలో మండిపడ్డారు. కాగా ఆండ్రాయిడ్ ఫోన్లలో సేవ్ చేసిన పాత ఆధార్ నంబర్ 1947 కూడా 1800–300–1947గా మారింది. ఈ తతంగాన్ని ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్ ఇలియట్ గుర్తించారు. వెంటనే ‘హాయ్ యూఐడీఏఐ. ఆధార్ ఉన్న, లేనివారు, ఎంఆధార్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న, చేసుకోని వారు ఇలా అందరి ఫోన్లలోకి టోల్‌ఫ్రీ నంబర్ వచ్చింది.
దీనిపై ప్రజలకు సమాచారమే లేదు. ఎందుకో చెబుతారా?’ అని ట్వీట్ చేశారు. కాగా, ఆధార్ టోల్ ఫ్రీ నంబర్‌ను ఫోన్లలో చేర్చాల్సిందిగా తాము ఏ మొబైల్ తయారీ సంస్థను, సర్వీస్‌ప్రొవైడర్‌ను కోరలేదని యూఐడీఏఐ తెలిపింది. తాము ఆధార్ టోల్ ఫ్రీ నంబర్ 1947ను మార్చలేదనీ, ప్రస్తుతం దీన్నే వాడుతున్నామని స్పష్టం చేసింది. మరోవైపు తమ సిబ్బంది అజాగ్రత్త కారణంగానే ఈ తప్పిదం చోటుచేసుకున్నట్లు ప్రకటించిన గూగుల్ యూజర్లను క్షమాపణలు తెలిపింది. కోడింగ్ తప్పిదం కారణంగా పాత టోల్ ఫ్రీ నంబర్ 1800–300–1947తో పాటు ఎమర్జెన్సీ నంబర్ 112 యూజర్ల సెటప్ విజార్డ్‌లోకి చేరిపోయాయని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment