వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ | WhatsApp Launches New Feature On Android Beta | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌

Published Fri, Mar 30 2018 5:18 PM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

WhatsApp Launches New Feature On Android Beta - Sakshi

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ (ఫైల్‌ ఫోటో)

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌​ బీటా యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ను నేడు లాంచ్‌ చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ వాట్సాప్‌ నెంబర్లను తేలికగా మార్చుకోవచ్చు. అంతేకాక ఎలాంటి గందరగోళం లేకుండా కొత్త నెంబర్‌కు డేటాను కూడా బదిలీ చేసుకోవచ్చు. కొత్త ‘ఛేంజ్‌ నెంబర్‌’ ఫీచర్‌ అప్‌డేట్‌ ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌లోని  2.18.97 ఆండ్రాయిడ్‌ బీటా అప్‌డేట్‌కు అందుబాటులో ఉంది. అనంతరం ఈ ఫీచర్‌ ఐఓఎస్‌, విండోస్‌ డివైజ్‌లకి కూడా అందుబాటులోకి రానుంది.  

కొత్త ‘ఛేంజ్‌ నెంబర్‌’ ఫీచర్‌తో ఓల్డ్‌ ఛేంజ్‌ నెంబర్‌ ఫీచర్‌కు మరిన్ని మెరుగులను అందించిందని డబ్ల్యూఏబీటాఇన్ఫో ట్వీట్‌ చేసింది. ఈ ఫీచర్‌తో అన్ని లేదా కొన్ని కాంటాక్ట్‌లను నోటిఫై చేయాలనుకుంటే, యూజర్లు ఆ స్పెషిఫిక్‌ కాంటాక్ట్‌లను ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది. ఛాట్‌ హిస్టరీని కొత్త ఛాట్‌లోకి మార్చుకోవచ్చని, డూప్లికేట్‌ ఛాట్‌లను డిలీట్‌ చేసుకోవచ్చని రిపోర్టు చేసింది. దీనికోసం యూజర్లు వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోని అకౌంట్‌లో ఈ ‘ఛేంజ్‌ నెంబర్‌’అనే అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఆప్షన్‌లో పాత, కొత్త ఫోన్‌ నెంబర్లను ఇన్‌సర్ట్‌ చేశాక, మీ కొత్త నెంబర్‌కు ఏ కాంటాక్ట్‌లను నోటిఫై చేయాలో వాట్సాప్‌ కోరుతోంది. కొత్త నెంబర్‌లోకి మారిన తర్వాత, పాత ఛాట్‌లో ఉన్న షేర్డ్‌ మెసేజ్‌లు‌, కొత్త దానిలోకి మరలుతాయని డబ్ల్యూబీటాఇన్ఫో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement