ముంబై : యూట్యూబ్‌లోనే, ఫేస్‌బుక్‌లోనే మంచి వీడియోనో, సినిమానో చూస్తుంటాం.. సడెన్‌గా వాట్సాప్‌లో మెసెజ్ వస్తుంది. అప్పుడేం చేస్తాం.. వీడియోను పాస్ చేసి.. వాట్సాప్ ఓపెన్ చేసి రిప్లై ఇస్తాం. మళ్లీ యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియో చూడ్డం కంటిన్యూ చేస్తాం. ఇది ఇప్పటిదాకా పరిస్థితి. అదే ఐఫోన్ యూజర్లకైతే ఈ పరిస్థితి ఉందదు. వారు ఎంచక్కా వీడియోలను ఎంజాయ్ చేస్తూనే.. వాట్సాప్‌లో చాట్ చేస్తూంటారు. కానీ ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సౌలభ్యం లేదు. కానీ ఇక మీదట అలా జరగదంటూన్నారు వాట్సాప్ అధికారులు.
ఎందుకంటే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కూడా ఈ అద్భుత ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. ‘పిక్చర్ ఇన్ పిక్చర్’ పేరిట నయా ఫీచర్ ఒకటి వాట్సాప్‌లోకి వచ్చేసింది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలని మరో యాప్‌కి రీడైరెక్ట్ కాకుండానే వాట్సాప్‌లోనే ప్రత్యేక విండోలో చూసే అద్భుత అవకాశాన్ని యూజర్లందరికి కల్పించింది. దాంతో ఇతరులతో చాటింగ్ చేస్తూనే థర్డ్ పార్టీ యాప్స్ అయిన యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వీడియోలని వాట్సాప్‌లోనే ప్లే చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే ప్లేస్టోర్‌లో వాట్సాప్ వర్షన్ 2.18.380కి అప్‌డేట్ చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు. గ్రూప్ చాట్, సింగిల్ చాట్‌లను కూడా ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుందని వాట్సాప్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment