పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ రోజుకో కొత్త ఫీచర్‌తో యూజర్లను అలరిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా యాప్ యూజర్ల కోసం టెస్ట్ చేస్తోంది. అదీ పొరపాటున డిలీట్ అయి పోయి మీడియా ఫైల్స్‌ను తిరిగి డౌన్‌లోడ్ చేసుకునే పీచర్. అంటే మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఏమైనా ఇమేజస్‌ను, జీఐఎఫ్‌ఎస్‌ను కానీ, వీడియో, ఆడియో ఫైల్స్‌ను కానీ, ఆడియో రికార్డింగ్‌లను, డాక్యుమెంట్లను డిలీట్‌చేస్తే, వాటిని తిరిగి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును ఈ ఫీచర్ సహకరిస్తుంది. ఇప్పటి వరకైతే డిలీట్ చేసిన వీటిని తిరిగి డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం మాత్రం లేదు.
ఈ ఫీచర్‌తో ప్రస్తుతం సర్వర్ల నుంచి వాటిని రీ-డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ కల్పిస్తుందని డబ్ల్యూబీటాఇన్ఫో రిపోర్టు తెలిపింది. డివైజ్‌లలో తక్కువ స్టోరేజ్ కలిగి ఉన్న యూజర్లకు ఇది ఎంతో ఉపయోగపడనుందట. అయితే ఈ ఫీచర్‌పై యూజర్ల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. డిలీట్ చేసినప్పటికీ ఫైల్స్‌ను వాట్సాప్ స్టోర్ చేస్తుండటం సెక్యురిటీ సమస్యలను తెచ్చిపెడుతుందని యూజర్లు పేర్కొంటున్నారు. అయితే తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రతి డేటా ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా వాట్సాప్ పేర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment