ఆండ్రాయిడ్ 11తో రానున్న గెలాక్సీ ఎ32 5జీ | Samsung Galaxy A32 5G May Come With Android 11 Out of the Box | Sakshi

ఆండ్రాయిడ్ 11తో రానున్న గెలాక్సీ ఎ32 5జీ

Published Wed, Dec 2 2020 4:38 PM | Last Updated on Wed, Dec 2 2020 4:51 PM

Samsung Galaxy A32 5G May Come With Android 11 Out of the Box - Sakshi

శామ్సంగ్ గెలాక్సీ ఎ32 5జీ మొబైల్ అవుట్ అఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11తో రానున్నట్లు సమాచారం. దీనికి సంబందించిన కొన్ని లీక్స్ బయటకి వచ్చాయి. ఈ ఫొటోలో నాచ్ డిస్ప్లే, చిన్న కెమెరా బంప్ తో రానున్నట్లు కనిపిస్తుంది. మోడల్ నంబర్ ఎస్‌ఎమ్-ఎ326బితో వస్తున్న ఫోన్ గెలాక్సీ A32 5జీ అని సమాచారం. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ దీని గురుంచి ఎటువంటి సమాచారం తెలపలేదు. ఇది ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ తో వన్ UI 3.0పై పని చేయనుంది. ఇటీవల గెలాక్సీ ఎ32 5జీ యొక్క ఫీచర్స్ గురుంచి కొన్ని రూమర్లు బయటికి వస్తున్నాయి. ఇందులో 6.5-అంగుళాల డిస్ప్లే మరియు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను చూపిస్తుంది. ఫోన్ ఫ్లాట్ అయిన ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్‌తో పాటు ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం నాచ్ తో వస్తుంది అని నివేదిక పేర్కొంది. ప్రధాన కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ తో రానున్నట్లు సమాచారం. ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ లేని బ్యాక్ ప్యానెల్ తో ఫ్లష్ గా ఉంటుంది. గెలాక్సీ ఎ 32 5జీ మొబైల్ యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌తో రావచ్చు.(చదవండి: రియల్‌మీలో స్నాప్‌డ్రాగన్ 888)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement