
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇటీవల తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. యూజర్ల డేటాను అక్రమంగా కేంబ్రిడ్జ్ అనలిటికాకు షేర్‌చేసిందనే వార్తలతో, ఫేస్‌బుక్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ కూడా చెప్పారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఫేస్‌బుక్ తన ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త ఫీచర్‌ను సైతం లాంచ్ చేసింది. ఆ ఫీచర్ ద్వారా ఫేస్‌బుక్ యాప్‌ను వాడుతూ యూజర్లు తమ ప్రీపెయిడ్ మొబైల్ నెంబర్‌కు రీఛార్జ్ చేసుకోవచ్చట. ఆండ్రాయిడ్ వెర్షన్ 167.0.0.42.94పై ఇప్పటికే ఈ ఫీచర్ స్పాట్ అయింది. టాప్‌లో కుడివైపు ‘మొబైల్ రీఛార్జ్’ అనే ఆప్షన్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు కనిపిస్తుందని, ఒకవేళ అక్కడ కనిపించకపోతే, ‘సీ మోర్’లో ఈ ఫీచర్ ఉంటుందని తెలిపింది.
ఇలా ఈ ఆప్షన్లను ట్యాప్ చేసిన అనంతరం ఓ వెల్‌కమ్ స్క్రీన్ వస్తుంది. దానిలో ప్లాన్‌ను ఎంపిక చేసుకోండి, మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా సెక్యుర్‌గా, ఫ్రీగా, చాలా వేగంగా చెల్లించుకోండి అనే సందేశం వస్తోంది. ‘రీఛార్జ్ నౌ’ అనే దాన్ని ట్యాప్ చేస్తే, అది మీ నెంబర్, ఎంపిక చేసుకునే ఆపరేటర్, ప్లాన్లను బ్రౌజ్ చేసుకునే ఆప్షన్ అన్నీ ఉండే పేజీలోకి తీసుకెళ్తోంది. ఒక్కసారి నెంబర్ ఎంటర్ చేస్తే, ఫేస్‌బుకే ఆటోమేటిక్‌గా ఆపరేటర్‌ను ఎంపిక చేస్తుంది. ఒకవేళ సర్కిల్ మార్చాలనుకుంటే, ప్రస్తుత ఆపరేటర్‌ను ఎంపిక చేసుకోవాలి. ప్లాన్ ఎంపిక చేసుకుంటే, అది ఆర్డర్ వివరాలున్న పేజీలకి తీసుకెళ్తోంది. అక్కడ ఆర్డర్ వివరాలన్నీ నమోదుచేస్తే, యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవడానికి ఓటీపీని లేదా 3డీ సెక్యుర్ పాస్‌వర్డ్‌ను అడుగుతోంది. ఇలా యూజర్లు మీ ప్రీపెయిడ్ మొబైల్ నెంబర్లకు ఫేస్‌బుక్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. పలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లనో ఈ ఫీచర్ స్పాట్ అయింది. కానీ ఆపిల్ ఐఫోన్లలో ఇంకా ఈ ఫీచర్ అందుబాటులోకి రాలేదు. అయితే ఈ ఫీచర్ కూడా ప్రస్తుతం ప్రీపెయిడ్ నెంబర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. పోస్టు పెయిడ్ బిల్లులను చెల్లించుకునే వీలులేదు. కేవలం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. నెట్‌బ్యాంకింగ్, యూపీఐ, లేదా ఇతర పేమెంట్ మార్గాలతో పేమెంట్లు చేసుకోవడానికి వీలులేదు. ఫేస్‌బుక్ సొంతమైన వాట్సాప్ కూడా రెండు నెలల క్రితమే తన ప్లాట్‌ఫామ్‌పై పేమెంట్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment